WWE రెజ్లింగ్ మేనియాలో రానా దగ్గుబాటి! తొలి భారతీయ సెలబ్రెటీగా రికార్డ్!

naveen
By -

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రానా WWE ఫేమ్ రెజ్లింగ్ మేనియాలో ప్రత్యేకంగా కనిపించారు. రెజ్లింగ్ మేనియా 41 త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రానా ఈ ప్రతిష్టాత్మక రెజ్లింగ్ పోటీలను చూసేందుకు వెళ్లారు.

WWE చూసేందుకు వెళ్లిన మొట్టమొదటి భారతీయ సెలబ్రెటీగా రానా చరిత్ర సృష్టించారు. అక్కడ రానా దిగిన పలు ప్రత్యేకమైన ఫోటోలను నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంది. రెజ్లింగ్ మేనియాను లైవ్‌లో చూడటానికి వెళ్లిన తొలి భారతీయ సినిమా సెలబ్రెటీగా రానా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

ఈ ప్రత్యేక అనుభవం గురించి రానా మాట్లాడుతూ.. “WWE 41లో ఉండటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. WWE అనేది మనందరి బాల్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇప్పుడు దానిని ప్రత్యక్షంగా చూడటం మరియు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా WWE మరియు రానా నాయుడు రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కావడం మరింత ఆనందంగా ఉంది” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు రానా.

రెజ్లింగ్ మేనియా 41 త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ లాస్ వెగాస్‌లో జరగనుంది. ఇది కేవలం అభిమానులకే కాకుండా ప్రపంచ సంబంధాల వేడుకగా కూడా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడే కార్యక్రమాలలో ఇది ఒకటి. ఇందులో రానా దగ్గుబాటి ప్రత్యేకంగా హాజరుకావడం భారతీయ ప్రాతినిధ్యానికి గర్వకారణం.

ఇదిలా ఉండగా, రానా మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన రానా నాయుడు సీజన్ 2 కూడా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.