Horoscope Today in Telugu | నేటి రాశి ఫలాలు (ఏప్రిల్ 15, 2025): మీ రాశి ఫలితాలు తెలుసుకోండి !



2025 ఏప్రిల్ 15 వ తేదీ యొక్క మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో చూడండి.

 మేషం (Aries)

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. సన్మానాలు పొందుతారు. కొత్త విద్యావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలయిక ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. 

వృషభం (Taurus)

నూతన ఉద్యోగ లాభం పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం (Gemini)

ఇంట్లో మరియు బయట ఒత్తిడులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు అంతగా అనుకూలంగా ఉండవు.

కర్కాటకం (Cancer)

దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం (Leo)

చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో తిరుగులేని పరిస్థితి ఉంటుంది.

కన్య (Virgo)

మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. మీ ఆలోచనలు ఇతరులతో కలవవు. బంధువులతో కలయిక ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో నిరాశ ఎదురవుతుంది.

తుల (Libra)

చేసే పనులలో పురోగతి సాధిస్తారు. సమాజంలో మంచి ఆదరణ లభిస్తుంది. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

సన్నిహితులతో వివాదాలు ఏర్పడవచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనుస్సు (Sagittarius)

కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులతో కలయిక ఉంటుంది. విందు మరియు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో మరింత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn)

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో మీదే ఆధిపత్యం ఉంటుంది.

కుంభం (Aquarius)

సన్నిహితులు మరియు మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మీనం (Pisces)

కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ముందు తీసుకున్న నిర్ణయాలను మార్చుకుంటారు. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు