రేప్ సీన్ షూటింగ్ తర్వాత వాంతులు చేసుకున్నా: దియా మీర్జా షాకింగ్ కామెంట్స్!

naveen
By -

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా సాధారణమైపోయాయి. ఈ మధ్యకాలంలో సినిమాల్లో రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఇస్తున్నారు దర్శకులు. ఏ జోనర్ సినిమా అయినా కొన్ని రొమాంటిక్ సీన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కనీసం లిప్ కిస్ లేకుండా సినిమాలు రావడం లేదు. అయితే హీరోయిన్స్ కూడా రొమాంటిక్ మరియు ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి వెనకాడటం లేదు. గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు అందాల భామలు. 

అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం రొమాంటిక్ సీన్స్ జోలికి పోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం ఇబ్బందిగా అనిపించినట్టు తెలిపారు. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా రేప్ సీన్ షూటింగ్ సమయంలో వాంతులు చేసుకున్నానని చెప్పడం సంచలనం రేపుతోంది.

 ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రీ రిలీజ్ హడావిడి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కూడా రీ రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ దియా మీర్జా.

'కాఫిర్' షూటింగ్‌లో దియా మీర్జా చేదు అనుభవం

అందాల భామ దియా మీర్జా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు 2019లో 'కాఫిర్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ విపరీతమైన స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రీ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆ సిరీస్ షూటింగ్‌లో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపింది. ఈ సిరీస్ షూటింగ్‌లో ఒక రేప్ సీన్ చిత్రీకరణ తర్వాత తాను వాంతి చేసుకున్నానని చెప్పింది. 'కాఫిర్'కు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. దియా మీర్జా కైనాజ్ అక్తర్ అనే పాత్రలో నటించింది.

భయానకమైన అనుభవం.. శారీరకంగా వణికిపోయాను

రేప్ సీన్ తర్వాత తాను శారీరకంగా చాలా వణికిపోయానని దియా మీర్జా తెలిపింది. ఆ సీన్ పూర్తయిన తర్వాత తాను వాంతులు చేసుకున్నానని, పరిస్థితులు డిమాండ్ చేయడంతో తాను భావోద్వేగంగా మరియు శారీరకంగా చాలా అలసిపోయానని ఆమె చెప్పుకొచ్చింది. దియా మీర్జా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags: