మలయాళీ సినీరంగంలో ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించాడు. అందమైన ప్రేమకథతో యువత మనసులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారుతాడని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ యువ హీరో సినిమాలు విడిచిపెట్టి ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్తున్నాడు. వరుస హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విదేశాలకు వెళ్లి గొర్రెలు కాస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. తనే ప్రణవ్ మోహన్ లాల్, మలయాళీ చిత్రపరిశ్రమలో యంగ్ హీరోలలో ఒకరు, సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు. కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి కూలీ పనికి వెళ్తున్నాడు.
ప్రణవ్ మోహన్ లాల్ సినీ ప్రస్థానం
ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా ప్రణవ్ మోహన్ లాల్ తన ప్రత్యేకతను సుస్పష్టంగా చూపించాడు. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి చివరకు హీరోగా సక్సెస్ అయ్యాడు. 'హృదయం' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు మలయాళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళంలో 'వర్షంగళ్కు శేషం' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమాలకు దూరం: ప్రణవ్ వినూత్న జీవనం
ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రణవ్.. ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. చిన్ననాటి నుంచే ప్రయాణాలపై ఆసక్తి కలిగిన ప్రణవ్ ప్రస్తుతం సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. హీరోగా నటించడం ప్రారంభించిన 7 ఏళ్లలో దాదాపు 5 చిత్రాల్లో నటించాడు. ప్రతి సినిమా కంప్లీట్ కాగానే అనుభవం కోసం ఏదో ఒక ఊరికి వెళ్తుంటాడు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న ప్రణవ్.. అక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా పనిచేస్తున్నాడు. భోజనం, షెల్టర్ ఇస్తారని, జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి, మోహన్ లాల్ సతీమణి తెలిపారు. సాధారణ జీవితం గడుపుతూ, సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదు.