మంత్రి కాన్వాయ్‌కే చుక్కలు చూపించాడు ఓ ఆటో డ్రైవర్. పోలీస్ ఎస్కార్ట్ వాహనం సైరన్ మోగినా సైడ్ ఇవ్వకపోగా, ఏకంగా మంత్రి కారునే ఢీకొట్టబోయాడు. శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో, ఆటో డ్రైవర్‌ను చూసి మంత్రి సవిత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
కాన్వాయ్‌కు అడ్డంగా ఆటో..
శ్రీ సత్య సాయి జిల్లాలో మంత్రి సవిత పెనుకొండ నుంచి అనంతపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌కు ఓ ఆటో అడ్డు తగిలింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనం సైరన్ కొట్టినా, ఆటో డ్రైవర్ బాలన్న ఏమాత్రం పక్కకు జరగలేదు.
కారు దిగి.. డ్రైవర్‌పై మంత్రి ఫైర్!
పోలీస్ ఎస్కార్ట్ వాహనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా, ఆటో డ్రైవర్ బాలన్న రోడ్డుపై అటు ఇటు అడ్డంగా తిప్పుతూ కంగారు పెట్టాడు. ఏకంగా మంత్రి ప్రయాణిస్తున్న కారునే ఢీకొట్టబోయాడు. కాసేపటికి ఆటోను ఓవర్‌టేక్ చేసిన మంత్రి సవిత, కారు దిగి ఆటో డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుల్లుగా తాగి.. రోడ్డుపైనే క్లాస్!
ఆటో డ్రైవర్ బాలన్న పరిస్థితి చూసి మంత్రి సవితకు మరింత కోపం వచ్చింది. అతను ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడు. ప్రయాణికులను ఎక్కించుకుని, సోయిలో లేకుండా ఆటో నడుపుతున్న బాలన్నపై మంత్రి సీరియస్ అయ్యారు. "మద్యం తాగి ఆటో నడిపి ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?" అంటూ అతని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రోడ్డుపైనే క్లాస్ పీకారు.
వెంటనే పోలీసులను పిలిచి, ఆటో డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని మంత్రి సవిత ఆదేశించారు. "వీడెవడండీ బాబు.. రోడ్డుపై వెళ్తున్న మంత్రికే చుక్కలు చూపించాడు" అని అక్కడి వాహనదారులు అనుకోవడం గమనార్హం.

