Ghooskhor Pandat Movie Controversy: నెట్‌ఫ్లిక్స్ పై ఫైర్

naveen
By -
Ghooskhor Pandat Movie Controversy: నెట్‌ఫ్లిక్స్ పై ఫైర్

Ghooskhor Pandat Movie Controversy

Ghooskhor Pandat Movie Controversy: నెట్‌ఫ్లిక్స్‌పై భగ్గుమన్న అయోధ్య.. ఆ సినిమాను బ్యాన్ చేయాల్సిందే!


ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) మరోసారి వివాదంలో చిక్కుకుంది. కంటెంట్ పేరుతో మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందనే విమర్శలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న Ghooskhor Pandat Movie (ఘూస్ఖోర్ పందాట్) టైటిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. అయోధ్య సాధువుల నుంచి పీఠాధిపతుల వరకు అందరూ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ టైటిల్ లో ఉన్న అభ్యంతరకర పదం ఏంటి? శాంతమూర్తులుగా ఉండే సాధువులు ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నారు?


బ్రాహ్మణులపై విషం చిమ్ముతారా?

సినిమా టైటిల్ 'ఘూస్ఖోర్ పందాట్' (లంచగొండి పండితుడు) అని పెట్టడమే అసలు సమస్య. అయోధ్యలోని సాకేత్ భవన్ మహంత్ సీతారాం దాస్ మహారాజ్ దీనిపై నిప్పులు చెరిగారు. "ఒక నిర్దిష్ట వర్గాన్ని టార్గెట్ చేస్తూ, వారి కులాన్ని సూచించే పేరు పక్కన 'లంచగొండి' అనే పదాన్ని చేర్చడం అత్యంత హేయమైన చర్య. ఇది కేవలం సినిమా టైటిల్ కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజాన్ని అవమానించడమే" అని ఆయన మండిపడ్డారు. సమాజంలో చెడును చూపించాలనుకుంటే.. శాంతియుతంగా, దేశభక్తితో ఉండే బ్రాహ్మణులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వేరే మతాల్లో ఇలాంటి వారు లేరా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.


సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?

మరోవైపు సిద్ద పీఠ్ హనుమాన్ గఢీకి చెందిన మహంత్ దేవేశాచార్య మహారాజ్.. సెన్సార్ బోర్డు (CBFC) తీరును తప్పుబట్టారు. సమాజంలో చిచ్చుపెట్టే ఇలాంటి టైటిల్స్ కు అనుమతి ఎలా ఇస్తున్నారని నిలదీశారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని, ఒక వర్గంపై ద్వేషాన్ని పెంచే కుట్ర అని ఆరోపించారు. చిత్ర నిర్మాతలు వెంటనే బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


నిర్మాతలకు డేంజర్ బెల్స్.. జగద్గురు వార్నింగ్

ఈ వివాదం ఇక్కడితో ఆగేలా లేదు. జగద్గురు పరమహంసాచార్య మహారాజ్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను అద్దం పడుతున్నాయి. "ఈ సినిమా గనుక విడుదలైతే దేశంలో సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. అంతేకాదు, ఈ సినిమా నిర్మాతలపై దాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది" అని సంచలన హెచ్చరిక చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఏ వర్గాన్ని కించపరిచే సినిమాలను విడుదల కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.


క్రియేటివిటీకి హద్దులుండాలి! 

వినోదం పేరుతో ఒక వర్గాన్ని కించపరచడం ఆమోదయోగ్యం కాదు. నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండకపోతే.. భారతీయ మార్కెట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.


Tags: