Nikhil Comments on AI: ప్రభాస్ సినిమాపై సెటైరా?

naveen
By -
Nikhil Comments on AI


యువ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) పాన్ ఇండియా మూవీ 'స్వయంభు' (Swayambhu) టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజువల్స్ అదుర్స్ అనిపించినా.. నిఖిల్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. "మా సినిమాలో ఇటీవలి చిత్రాల మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడలేదు" అని ఆయన చెప్పడం వివాదానికి దారితీసింది. పరోక్షంగా ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాను టార్గెట్ చేశారా? అనే అనుమానాలు నెటిజన్లలో కలుగుతున్నాయి. అసలు నిఖిల్ ఎందుకలా ట్వీట్ చేశారు? నెటిజన్లు ఎందుకు భగ్గుమంటున్నారు?


టీజర్ రీ-అప్‌లోడ్.. ట్వీట్ లో సెటైర్?


'స్వయంభు' టీజర్ లో సాంకేతిక లోపం రావడంతో దాన్ని ఎడిట్ చేసి, హెచ్‌డీఆర్ క్వాలిటీలో మళ్లీ యూట్యూబ్ లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ నిఖిల్ ఎక్స్ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. "యూట్యూబ్ ఎందుకు భయ్యా ఇలా గ్లిచ్ చేశావు? ఇటీవల విడుదలైన ఇతర చిత్రాల మాదిరిగా మా సినిమాలో AI ఉపయోగించలేదు" అని కామెంట్ చేశారు. అంతేకాదు, "ఇటీవలి సినిమాల మాదిరిగా ఏఐ వాడలేదంట" అని ఒక నెటిజన్ పెట్టిన ట్వీట్ ని లైక్ కూడా చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.


టార్గెట్ 'రాజాసాబ్'?


సంక్రాంతికి వచ్చిన ప్రభాస్ సినిమా 'రాజాసాబ్' (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX) క్వాలిటీ నాసిరకంగా ఉందని, ఏఐ షాట్స్ వాడారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు నిఖిల్ "ఇటీవలి సినిమాలు" అనగానే అందరి వేళ్లు 'రాజాసాబ్' వైపే చూపిస్తున్నాయి.


టీజర్ ఈవెంట్ లోనూ అదే మాట..


టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా నిఖిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. "ఈరోజుల్లో నిర్మాతలు తొందరపడి వీఎఫ్ఎక్స్ లో తప్పులు చేస్తున్నారు. కొన్ని సినిమాలు సీజీ షాట్స్ సరిగా చేసుకోకపోవడం వల్ల మొదటికే మోసం వచ్చింది. పేర్లు చెప్పను కానీ.. ఆ తప్పులు మా సినిమాకు జరగకూడదనే లేట్ అయినా పర్ఫెక్ట్ గా వచ్చాం" అని అన్నారు.


నిఖిల్ పై నెటిజన్ల ఫైర్


నిఖిల్ వ్యాఖ్యలపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. "నీ సినిమా గొప్పతనం చెప్పుకో.. కానీ పక్క సినిమాను తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు?" అని ప్రశ్నిస్తున్నారు.

  • కామెంట్ 1: "ఇతర AI చిత్రాల మాదిరిగా కాకుండా.. నేను మీ సినిమాను బాయ్ కాట్ చేయడానికి ఇదే కారణం."

  • కామెంట్ 2: "నీ టీజర్ చూస్తుంటే 'బాహుబలి', 'మగధీర' కాపీలా ఉంది. కాపీ కొట్టడానికి రెండున్నరేళ్లు టైమ్ తీసుకున్నావా?"

  • లాజిక్: ఏఐ వాడటం తప్పేం కాదు, టెక్నాలజీని వాడుకుని మంచి విజువల్స్ ఇవ్వడమే ముఖ్యం అని మరికొందరు హితవు పలుకుతున్నారు.


ప్రమోషన్ కోసం పక్కోడిని వాడాలా? 

తన సినిమాను హైలైట్ చేసుకోవడానికి వేరే సినిమాను కించపరచడం నిఖిల్ కు అవసరమా? ఈ వివాదం 'స్వయంభు'కు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? వేచి చూడాలి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!