ఎన్టీఆర్ డ్రాగన్ ఓ అణుబాంబు: రాజీవ్ కనకాల క్రేజీ అప్‌డేట్!

naveen
By -
ఓపెన్‌హైమర్ రేంజ్ ఇంపాక్ట్: డ్రాగన్‌పై రాజీవ్ సంచలన వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా అణుబాంబులా పేలడం ఖాయమని నటుడు, తారక్ ప్రాణ స్నేహితుడు రాజీవ్ కనకాల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్‌తో తనకున్న రాక్షస ప్రేమ గురించి, అలాగే డ్రాగన్ సెట్స్‌లో ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా చూశాక నందమూరి అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం పక్కా అంటూ రాజీవ్ ఇచ్చిన హైప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

[FEATURED_IMAGE]

మాది రాక్షస ప్రేమ!


ఎన్టీఆర్ కెరీర్ మొదలైనప్పటి నుంచి రాజీవ్ కనకాలతో ఆయనకు ఎంతటి బలమైన స్నేహం ఉందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ బాండింగ్ గురించి రాజీవ్ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు ఇద్దరం తరచూ కలిసేవాళ్లమని, ఎన్టీఆర్‌కు బోర్ కొడితే వెంటనే తనకు ఫోన్ చేసి పిలిపించుకుంటాడని తెలిపారు.


అయితే పెళ్లి, పిల్లలు అయ్యాక కలవడం కాస్త తగ్గిందని, ఏడాది క్రితం తారక్ ఇంట్లోనే చివరిసారిగా కలిశామని చెప్పారు. తమది ఒక 'రాక్షస ప్రేమ' అని, ఇద్దరం మాట్లాడుకుంటే చూసేవాళ్లకు ఏంటిలా తిట్టుకుంటున్నారు అనిపిస్తుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.


ప్రశాంత్ నీల్ పక్కా క్లారిటీ!


ప్రస్తుతం ఈ ప్రాణ స్నేహితులిద్దరూ ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సెట్స్‌లో మళ్లీ కలుస్తున్నారు. ఈ మూవీలో రాజీవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని, వచ్చే నెలలో మళ్లీ తన పార్ట్ షూట్ ఉంటుందని రాజీవ్ వెల్లడించారు. నటీనటుల నుంచి ఏం కావాలో ప్రశాంత్ నీల్‌కు స్పష్టంగా తెలుసని, అనుకున్నది రాబట్టుకునే వరకు వదలరని ప్రశంసించారు.


రెండు కాలర్లు ఎగరేస్తారు 


ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. రాజీవ్ కనకాల మాటలు ఆ అంచనాలను పదింతలు పెంచేశాయి. డ్రాగన్ సినిమా ఒక అణుబాంబు లాంటిదని, హాలీవుడ్ సెన్సేషన్ 'ఓపెన్‌హైమర్' స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉంటుందని రాజీవ్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదు. ఈ మాటలు వింటుంటే.. సినిమా చూశాక నందమూరి ఫ్యాన్స్ ఒక కాలర్ కాదు, ఏకంగా రెండు కాలర్లు ఎగరేయడం గ్యారెంటీ అనిపిస్తోంది!