బయట నుంచి చూసే సగటు ప్రేక్షకుడికి సినీ పరిశ్రమ అంటే రంగుల ప్రపంచం, కోట్లు కురిపించే గ్లామర్ ఫీల్డ్. కానీ, ఆ రంగుల వెనుక స్టార్ హీరోయిన్లు సైతం ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో చెప్పే సంచలన నిజాలను బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే బయటపెట్టింది. లోదుస్తులు లేకుండా ఓ యాక్షన్ సీన్ చేయాలంటూ మేకర్స్ తనను పెట్టిన టార్చర్‌ను ఆమె ఓపెన్‌గా చెప్పడం నెట్టింట పెను దుమారం రేపుతోంది. స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లకే సెట్స్‌లో భద్రత లేకపోతే.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
[FEATURED_IMAGE]బ్రా లేకుండా.. షర్ట్ బటన్స్ విప్పేసి!
ఎలాంటి విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధికా ఆప్టే.. గతంలో తను చేసిన ఓ యాక్షన్ సినిమా షూటింగ్లో ఎదురైన ఘోరమైన అనుభవాన్ని పంచుకుంది. యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని, బ్రా లేకుండా బటన్స్ విప్పేసి ఫైట్ చేయగలరా? అని సదరు మేకర్స్ తనను అడిగారని తెలిపి షాక్ ఇచ్చింది.
రెండు వారాల పాటు నరకం
అసలు ఫిజిక్స్ పరంగా అలా ఫైట్స్ చేయడం సాధ్యమేనా అని రాధిక మేకర్స్‌ను నిలదీసింది. బోల్డ్ సీన్స్ ఏవైనా ఉంటే స్క్రిప్ట్ సమయంలోనే ముందుగా చెప్పాలని, కానీ తీరా సెట్లోకి వచ్చాక.. ఆ సీన్‌కు రెండు రోజుల ముందు తనతో బేరసారాలు ఆడటం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పార్ట్ చూపిస్తారా? ఈ పార్ట్ చూపిస్తారా? అంటూ రెండు వారాల పాటు తనను విపరీతంగా టార్చర్ చేశారని రాధిక ఎమోషనల్ అయింది.
కోఆర్డినేటర్లూ కీలుబొమ్మలే!
సాధారణంగా బోల్డ్ సీన్లు తీసేటప్పుడు నటీనటులకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు 'ఇంటిమసీ కోఆర్డినేటర్లు' ఉంటారు. కానీ వారు సైతం నిర్మాతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని రాధిక సంచలన ఆరోపణలు చేసింది. ఎవరైనా హీరోయిన్ల తరఫున నిలబడి మాట్లాడితే, వాళ్లను ఏకంగా ఉద్యోగాల్లోంచే పీకేస్తున్నారని ఇండస్ట్రీలో దాగున్న చేదు నిజాన్ని బయటపెట్టింది.
గ్లామర్ ముసుగులో చీకటి నిజాలు
ఇండస్ట్రీలో పది మందిలో ఒకరిద్దరు చేసే ఇలాంటి పనుల వల్లే మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని రాధికా ఆప్టే చెప్పిన మాట నూటికి నూరుపాళ్లు వాస్తవం. అయితే, అంత పేరున్న హీరోయిన్ కూడా ఆ చేదు అనుభవం ఇచ్చిన సినిమా పేరును, ఆ డైరెక్టర్ పేరును ఇప్పటికీ బయటపెట్టలేకపోతోందంటే.. ఇండస్ట్రీలో బడా మేకర్స్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పని ప్రదేశంలో మహిళల భద్రతకు సంబంధించి చిత్ర పరిశ్రమలో కఠినమైన చట్టాలు, పారదర్శకమైన రూల్స్ అమలు కానంతవరకు.. గ్లామర్ ముసుగులో ఇలాంటి టార్చర్లు కొనసాగుతూనే ఉంటాయి!

