టాలీవుడ్‌లో ఎంత టాలెంట్, వ్యూహం ఉన్నా.. అప్పుడప్పుడు సెంటిమెంట్లు, టైమింగ్ మన తలరాతను మారుస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, 'ఆంజనేయ స్వామి' పేరుతో వచ్చే సినిమాలకు మధ్య నడుస్తున్న 'కోల్డ్ వార్' బాక్సాఫీస్ లెక్కలనే మార్చేస్తోంది. కోట్లు కుమ్మరించి సినిమాలు తీసినా, అదృష్టం కలిసిరాకపోతే రిలీజ్ డేట్లు ఎలా తలకిందులవుతాయో చెప్పడానికి ఈ పరిణామాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా కేవలం యాదృచ్చికమే అయినా, వందల కోట్ల బిజినెస్ జరిగే సినీ పరిశ్రమలో ప్లానింగ్ లోపాలు సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
[FEATURED_IMAGE]త్రివిక్రమ్ వర్సెస్ ఆంజనేయుడు.. సెంటిమెంట్ వార్?
2024 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ గురించి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సుమారు 132 కోట్ల భారీ బిజినెస్‌తో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా అంచనాలను అందుకోలేక చతికిలపడింది.
సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా కేవలం 29 కోట్ల బిజినెస్‌తో బరిలోకి దిగింది ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’. ఈ చిన్న సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సృష్టించిన సునామీ ముందు గురూజీ ప్లానింగ్ పూర్తిగా తేలిపోయింది.
వెనక్కి తగ్గిన 'ఆదర్శ కుటుంబం'
ఇక ఇప్పుడు హిందీలో కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో విడుదలై 400 కోట్లు రాబట్టిన 'హనుమాన్ అంశ్' సినిమాపై త్రివిక్రమ్ కన్ను పడింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని తెలుగులో ఆయనే రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత హొంబలే ఫిల్మ్స్, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి ఈ సినిమాను అక్టోబర్ 9కి షెడ్యూల్ చేశాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, అదే తేదీకి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ కొన్ని కారణాల వల్ల వాయిదా పడటం సంచలనంగా మారింది.
దేవుళ్లే దారి చేసుకుంటున్నారంటూ సెటైర్లు
'ఆదర్శ కుటుంబం' వెనక్కి తగ్గడం ద్వారా 'హనుమాన్ అంశ్' చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై మైత్రీ రవి చేసిన కామెంట్స్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
"దేవుళ్లే తమ దారులను తాము క్లియర్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 9న ఎలాంటి అడ్డంకులూ లేకుండా సినిమా వస్తోంది" అంటూ ఆయన పరోక్షంగా గురూజీని ఉద్దేశించి సెటైర్లు వేయడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
తమన్ ట్వీట్ గందరగోళం.. దసరా బరి నుంచి ఔట్?
'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ మరింత కన్ఫ్యూజన్‌కు దారితీసింది. సినిమా అక్టోబర్ 30న రిలీజ్ అని ముందు పోస్ట్ చేసి, వెంటనే దాన్ని ఎడిట్ చేస్తూ ఎమోజీ పెట్టడం వివాదాస్పదమైంది.
ఒకవేళ ఈ సినిమా నిజంగానే అక్టోబర్ 30కి వెళితే, దాదాపు పది రోజుల పాటు ఉండే దసరా సెలవుల భారీ అడ్వాంటేజ్‌ను చిత్ర యూనిట్ చేజేతులా వదులుకున్నట్లే. సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ టాక్ వస్తే తప్ప పండుగ సీజన్ లేని లోటును భర్తీ చేయడం అసాధ్యం.
గురూజీ కెరీర్‌కు ఇది బిగ్ అలర్ట్!
ఒకప్పుడు తన పక్కా ప్లానింగ్, క్రేజ్ తో బాక్సాఫీస్‌ను శాసించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, వరుసగా 'హనుమాన్' టైటిల్ పడిన ప్రతిసారీ ఎదురుదెబ్బలు తగలడం కాకతాళీయమే కావచ్చు. కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే దసరా లాంటి అద్భుతమైన పండుగ సీజన్‌ను మిస్ చేసుకుని రిలీజ్ వాయిదా వేసుకోవడం కచ్చితంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అక్టోబర్ నెలాఖరున సరైన అవుట్‌పుట్‌తో రాకపోతే మాత్రం కేవలం వీకెండ్ కలెక్షన్లతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాలకు బ్రేక్ పడాలంటే, 'ఆదర్శ కుటుంబం' సినిమాతో గురూజీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం ఒక్కటే మార్గం.

