తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ బడ్డీ కామెడీ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ఈ గురువారం థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడం, ప్రమోషన్లు అంతంతమాత్రంగానే ఉండటంతో బయటకు పెద్దగా హైప్ కనిపించకపోయినా, యువతలో ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్కున్న క్రేజ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. గతంలో రీ-రిలీజ్లో రికార్డులు సృష్టించిన ఈ గ్యాంగ్, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊహించని నంబర్లతో సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
[FEATURED_IMAGE]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగింది. సక్సెస్ రేట్ ఎలా ఉన్నా, పార్ట్-2 మరియు ఫ్రాంచైజీ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ గురువారం ఒక క్రేజీ సీక్వెల్ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. అదే ‘ఈఎన్ఈ రిపీట్’. 2018లో ‘పెళ్ళిచూపులు’ సెన్సేషన్ తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది కొనసాగింపు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా విడుదలైన సమయంలో ఓ మోస్తరు ఫలితాన్ని మాత్రమే అందుకుంది.
Also Read ఆకాశంలో ఒక తార: సాత్విక హిట్ కొడితే రామ్ చరణ్ మూవీలో ఛాన్స్! ➔రీ-రిలీజ్ క్రేజ్ తెచ్చిన సీక్వెల్.. కానీ ప్రమోషన్లు డల్!
అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి అసలైన మేనియా ఓటీటీలో మొదలైంది. డిజిటల్ వేదికపై యువత ఈ సినిమాను విరగబడి చూడటమే కాకుండా, కొన్నేళ్ల క్రితం రీ-రిలీజ్ చేసినప్పుడు మొదటి విడుదల కంటే భారీ వసూళ్లు అందించి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. అప్పటివరకు సీక్వెల్ ఆలోచన లేని తరుణ్ భాస్కర్, కుర్రకారు చూపించిన ఆ విపరీతమైన ఆదరణ తర్వాతే ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు.
Also Read అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ ‘గ్యాంగ్‌స్టర్’: 25% షేర్ డీల్! ➔కానీ ఈ సీక్వెల్ ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం భిన్నమైన దారిని ఎంచుకుంది. ఫస్ట్ టీజర్, పాటలు అంటూ హడావుడి చేయకుండా కొన్ని వారాల క్రితం నేరుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ట్రైలర్ క్రేజీగా ఉందని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం మొదటి భాగంలోని సహజమైన వైబ్ మిస్ అయిందని పెదవి విరిచారు. ఇక ప్రమోషన్ల పరంగానూ టీమ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు కేవలం సరదా చిట్చాట్స్లాగే ఉన్నాయి తప్ప, సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసేలా లేవనే అభిప్రాయం వినిపిస్తోంది.
సైలెంట్‌గా థియేటర్లకు కుర్రకారు.. బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ తప్పదా?
బయటకు చూస్తుంటే ‘ఈఎన్ఈ రిపీట్’కు రిలీజ్ ముంగిట పెద్దగా హైప్ లేనట్లు కనిపిస్తున్నా, ఈ సినిమాను తక్కువ అంచనా వేయడం పొరపాటే అవుతుంది. వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర అనే నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో యువతకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ చాలా ప్రత్యేకమైనది. ప్రమోషన్లు పెద్దగా లేకపోయినా, తమ ఫేవరెట్ గ్యాంగ్ కోసం రేపు కుర్రకారు సైలెంట్‌గా థియేటర్లకు క్యూ కడితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సినిమాకు కనీసం ఒక మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, యువత ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని వసూళ్లను అందించే అవకాశం ఉంది.

