లక్ష్మణుడి త్యాగం ఈరోజుల్లో సాధ్యమా? రణ్‌బీర్ ఆన్సర్!

naveen
By -
Ranbir Kapoor talks about Lakshmana sacrifice and sibling bonds in Ramayana movie interview.

గజం స్థలం కోసం సొంత అన్నదమ్ములే కత్తులు దూసుకుంటున్న రోజులివి. చిన్నపాటి ఆస్తి తగాదాలకే కోర్టు మెట్లు ఎక్కి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న నేటి సమాజానికి.. తన అన్న కోసం రాజభోగాలను వదిలేసిన 'లక్ష్మణుడి' త్యాగం ఎంతవరకు అర్థమవుతుంది? సరిగ్గా ఇదే పాయింట్‌పై 'రామాయణ' ప్రమోషన్స్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆధునిక కాలంలో అంతరించిపోతున్న అన్నదమ్ముల బంధంపై ఆయన ఇచ్చిన ఆన్సర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

[FEATURED_IMAGE]

ఈ కాలంలో ఆ త్యాగం సాధ్యమేనా?


బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్-వరల్డ్ మూవీ 'రామాయణ'లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. "నేటి స్వార్థపు రోజుల్లో అన్న కోసం అన్నీ వదులుకుని 14 ఏళ్లు అడవులకు వెళ్లిన లక్ష్మణుడి లాంటి వ్యక్తిని చూడగలమా?" అన్న ఆసక్తికరమైన ప్రశ్న రణ్‌బీర్‌కు ఎదురైంది.


విలువలు చచ్చిపోలేదు.. మరుగున పడ్డాయంతే!


ఈ ప్రశ్నకు రణ్‌బీర్ అత్యంత మెచ్యూర్డ్‌గా సమాధానం ఇచ్చారు. రామాయణంలో శ్రీరాముడు, లక్ష్మణుడి పాత్రలు నేటి సమాజానికి ఒక పర్ఫెక్ట్ మోడల్ అని ఆయన అన్నారు. ఆనాటి త్యాగాలు చరిత్రలో ఉన్నాయంటే.. అలాంటి మానవీయ విలువలు ఇప్పటికీ మనుషుల్లో ఉన్నట్లేనని, కాకపోతే నేటి బిజీ లైఫ్‌లో ఆ ‘మర్యాద’, ‘ధర్మం’ కాస్త మరుగున పడ్డాయని రణ్‌బీర్ చెప్పుకొచ్చారు.


రామాయణం తీయడానికి కారణం అదే!


పూర్తిగా అంతరించిపోతున్న బంధాలను, మనుషుల మధ్య నిస్వార్థమైన ప్రేమను నేటి తరానికి మళ్లీ బలంగా గుర్తుచేయడానికే రామాయణం లాంటి కథలు తీస్తున్నామని రణ్‌బీర్ స్పష్టం చేశారు. తోబుట్టువుల మధ్య ఆప్యాయతలు కరువవుతున్న ఈ కాలంలో, రామాయణ విలువలను ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన మాటలకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.


అన్నాదమ్ముల గొడవలు ఆపేలా ఉండాలి!  


కేవలం విజువల్ వండర్‌గా స్క్రీన్ మీద వందల కోట్లు ఖర్చు పెట్టి రామాయణాన్ని చూసి ఎంజాయ్ చేస్తే సరిపోదు. అందులోని విలువలను నేటి తరం నిజ జీవితంలో ఆచరించగలగాలి. ఆస్తి కోసం, ఇగో కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న అన్నదమ్ములు.. ఈ సినిమా చూశాక ఒక్క క్షణం ఆలోచించి మనస్పర్ధలు పక్కనపెట్టి మళ్లీ కలిస్తే, డైరెక్టర్ నితీష్ తివారీ, రణ్‌బీర్ కపూర్ పడ్డ కష్టానికి నిజమైన సార్థకత దక్కినట్లే. ఇలాంటి ఎమోషనల్ కనెక్టివిటీనే రేపు ఈ సినిమాను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుంది!