టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగులో ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రజనీకాంత్, అజిత్, ధనుష్ వంటి అగ్ర హీరోల ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. రెమ్యునరేషన్ తగ్గించడంతో ఇకపై ఆమె దూకుడును ఎవరూ ఆపలేరని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
[FEATURED_IMAGE]
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టం. ఒక్క విజయం దక్కితే వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి, అదే కాస్త తేడా కొడితే విమర్శలు చుట్టుముడతాయి. అయితే యంగ్ సెన్సేషన్ శ్రీలీల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 'పెళ్లి సందD'తో తెరంగేట్రం చేసి, మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ భామ.. తన అందం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించి అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంది.
గత కొద్దికాలంగా ఆమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాలు ఎదురైతే ఏ హీరోయిన్ కెరీర్ అయినా కాస్త నెమ్మదిస్తుంది. కానీ శ్రీలీల విషయంలో మాత్రం ఆఫర్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ పరిశ్రమల్లోనూ ఆమె క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.
కోలీవుడ్‌లో టాప్ హీరోలతో బిగ్ లైనప్!
ఇప్పటికే శివకార్తికేయన్ సరసన 'పరాశక్తి' చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన శ్రీలీల.. ప్రస్తుతం ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న 'ఓం' చిత్రంలో 'రోజా' అనే కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా కమల్ హాసన్ నిర్మాణంలో, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్గా ఎంపిక చేశారు. మరోవైపు అజిత్ కుమార్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డేర్‌డెవిల్'లోనూ శ్రీలీల భాగమైంది. ఇలా ఒకేసారి తమిళ అగ్ర హీరోలందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రెమ్యునరేషన్ తగ్గింపు.. ఇక శ్రీలీల జోరు మామూలుగా ఉండదు!
వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ, గత ఫలితాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలీల తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. రెమ్యునరేషన్ అందుబాటులో ఉంటే నిర్మాతలకు బడ్జెట్ భారం తగ్గి ఆమెను సంప్రదించడం మరింత సులువవుతుంది. పారితోషికం భారీగా ఉన్నప్పుడే స్టార్ హీరోల ప్రాజెక్టులను లైన్లో పెట్టిన ఈ భామ.. ఇప్పుడు రేటు తగ్గించడంతో నిర్మాతలు ఆమె కోసం మరింతగా క్యూ కట్టే అవకాశం ఉంది. ఈ భారీ లైనప్‌లో ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ కొట్టినా.. శ్రీలీల మళ్లీ తిరుగులేని స్టార్ హీరోయిన్గా నెం.1 స్థానాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

