రష్మిక భుజంపై విజయ్ దేవరకొండ చేయి: ఆ రూమర్లకు చెక్!

naveen
By -
Vijay Deverakonda and Rashmika Mandanna spotted together at airport shutting down trolls.

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మొన్నటివరకు ఎయిర్‌పోర్టులో రష్మికను విజయ్ పట్టించుకోలేదంటూ వచ్చిన విమర్శలకు ఈ రౌడీ హీరో తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి విమానాశ్రయంలో సందడి చేసిన విజయ్.. భార్య రష్మిక భుజంపై చేయి వేసుకుని ఎంతో అన్యోన్యంగా నడుచుకుంటూ వెళ్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ట్రోలర్స్‌ నోళ్లు మూయిస్తోంది.

[FEATURED_IMAGE]

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ ప్రయాణం నుంచి పెళ్లి బంధం వరకు వాళ్లు వేసిన ప్రతి అడుగు అభిమానులకు ఓ పండగలాగే మారింది. వివాహం తర్వాత ఈ జంట ‘రణబాలి’ సినిమా ప్రమోషన్స్‌లో కలిసి పాల్గొని ప్రేక్షకులను తెగ మెప్పించారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండానే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయంటూ రకరకాల పుకార్లు మొదలయ్యాయి.


ఆ షోతో మొదలైన వివాదం.. ఎయిర్‌పోర్ట్ రచ్చ!


ప్రముఖ బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో ఈ జంట పాల్గొన్నప్పటి నుంచి వివాదాలు ముదిరాయి. ఆ షోలో విజయ్ పట్ల రష్మిక తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచగా.. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే విజయ్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉండిపోయాడు. దీంతో రష్మికకే విజయ్ మీద ఎక్కువ ప్రేమ ఉందని, ఆమెనే అతడి వెంట పడుతోందంటూ కొందరు ఆకతాయిలు దారుణంగా ట్రోల్ చేశారు. దీనికి తోడు ఇటీవల ఎయిర్‌పోర్టులో విజయ్ వేగంగా ముందు నడుచుకుంటూ వెళ్లిపోగా, రష్మిక వెనుక రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే రూమర్లకు మరింత ఆజ్యం పోసింది.


తమపై వస్తున్న ఈ నెగెటివ్ కామెంట్లకు విజయ్ దేవరకొండ తన చేతలతోనే గట్టి సమాధానం ఇచ్చాడు. తాజాగా ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులతో కలిసి కనిపించిన విజయ్.. మీడియా కెమెరాల ముందే రష్మిక భుజంపై ఎంతో ప్రేమగా చేయి వేసుకుని నడిచాడు. గతంలో వచ్చిన విమర్శలకు కౌంటర్‌గానే విజయ్ కావాలని ఇలా చేశాడా అని కొందరు కామెంట్లు పెడుతున్నా.. నిజమైన అభిమానులు మాత్రం ఈ జంట అన్యోన్యతను చూసి మురిసిపోతున్నారు. విడిగా నడిచినా తప్పే, కలిసి నడిచినా తప్పేనా అంటూ ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేసే ట్రోలర్స్‌కు ఈ తాజా వీడియో ఒక చెంపపెట్టు లాంటిదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.