అక్షయ తృతీయ 2025 : ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం! గజకేసరి యోగం!

naveen
By -


 అక్షయ తృతీయ 2025: ఈ నెల 30న అక్షయ తృతీయ పర్వదినం ఒక విశిష్టమైన సందర్భంగా వస్తోంది. ఈ రోజున వృషభ రాశిలో ఉచ్ఛ చంద్రుడు, గురువు కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లో ఈశాన్య దిశలో కుబేర యంత్రం స్థాపించడం వల్ల మే 31 లోపు కొన్ని రాశుల వారు ఐశ్వర్యవంతులవుతారు. వీరికి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారు ప్రతి కార్యంలోనూ అద్భుతమైన పురోగతి సాధిస్తారు.

మేషం: ఈ రాశివారికి అక్షయ తృతీయ రోజున ధన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి ప్రయత్నం అంచనాలకు మించిన ఫలితాలను ఇస్తుంది. రావలసిన డబ్బు అంతా చేతికి చేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో మంచి లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగ స్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభాలతో దూసుకుపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ సంఘటనలు జరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృషభం: ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల బహుముఖ ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత, ప్రభావం గణనీయంగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబంతో వివాహ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం, గురువుతో కలయిక వల్ల ఈ రాశివారికి చేసే పనులన్నీ బంగారంగా మారతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. బహుముఖంగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో వివాహ సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో మంచి లాభాలు వస్తాయి.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో లాభాధిపతి చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం, గురువుతో కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు లాభాలను అందిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం బహుముఖంగా లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. వివాహాలు, గృహప్రవేశాల వంటి శుభ కార్యాలు జరుగుతాయి.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛ చంద్రుడు, గురువు కలయిక వల్ల ఉద్యోగంలో అధికార యోగం ఏర్పడుతుంది. సామర్థ్యానికి ఊహించని గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ బాగా రాణిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది. పిల్లలు బాగా పురోగమిస్తారు. సంతాన ప్రాప్తి అవకాశం ఉంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మీనం: రాశ్యధిపతి గురువు, ఉచ్ఛ చంద్రుడితో కలయిక వల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా సఫలమవుతాయి. కోరుకున్న వివాహ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు తప్పక లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్న మార్పులతో గణనీయమైన లాభాలు పొందుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.