తెలుగు సినీ రంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, ప్రభాస్, నాగచైతన్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించింది. కానీ, కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ, వచ్చిన అవకాశాలను వదులుకుంటూ సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. తాజాగా తన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈ హీరోయిన్, న్యాచురల్ స్టార్ నాని యాక్టింగ్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది. నానితో కలిసి సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు, పూజా హెగ్డే.
‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా, ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి ‘రెట్రో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా మే 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో, మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజాను తెలుగులో ఇంకా ఏ హీరోతో నటించాలనుకుంటున్నారని అడిగినప్పుడు, నాని యాక్టింగ్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది. నాని నటన అద్భుతంగా ఉంటుందని, అతని ‘నిన్ను కోరి’ సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పింది. నానితో సినిమా అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
‘నిన్ను కోరి’ సినిమా 2017లో విడుదలై, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో నాని, నివేధా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు, సూర్య, పూజా హెగ్డే కలిసి నటించిన ‘రెట్రో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వీరిద్దరూ ఢీగ్లామర్ లుక్ లో కనిపించనున్నారు.

