కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, ఈరోజు భారత్ మరియు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) ల మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాల DGMOలు సుమారు గంటపాటు చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో కాల్పుల విరమణకు సంబంధించిన విధివిధానాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు పలు ప్రతిపాదనలను ఈ భేటీలో ఉంచినట్లు సమాచారం. భారత్ తరపున DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మరియు పాకిస్తాన్ తరపున DGMO మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

