రిలీజ్‌కు 48 గంటలు ఉందనగా సినిమా ఆగిపోనుందా? దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల 'కాంత' చిత్రంపై చెన్నై కోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది!
'కాంత' బయోపిక్ వివాదం.. బ్యాన్ చేయాలని డిమాండ్!
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న 'కాంత' చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలో, ఈ సినిమా 1950ల నాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (MKT) బయోపిక్ అని, అందులో ఆయన్ను చాలా తప్పుగా, అనైతికంగా చూపించారంటూ.. ఆయన మనవడు చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది.
రంగంలోకి రానా.. "ఇది కల్పిత కథ!"
ఈ చివరి నిమిషం డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి, నిర్మాత రానా దగ్గుబాటి స్వయంగా రంగంలోకి దిగారు. 'కాంత' టీమ్ నుండి అధికారిక క్లారిటీ ఇస్తూ, ఇది బయోపిక్ కాదని స్పష్టం చేశారు. "మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. కాంత ఒక కల్పిత కథ," అంటూ రానా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, ఇది బయోపిక్ కాదని, కాబట్టి ఎవరి అనుమతులూ అవసరం లేదని లీగల్‌గా సేఫ్ అయ్యే ప్రయత్నం చేశారు.
నిజ సంఘటనల స్ఫూర్తి.. అయినా కల్పితమే!
అయితే, ఇది పూర్తిగా కల్పితమైతే 1950ల నాటి సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు, రానా ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. "ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదు... కానీ, ఈ కథ 1950లు, 60లు, 70లలో జరిగిన పలు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రాసుకున్నది," అని ఆయన అప్పుడే చెప్పారు. ఇప్పుడు "ఇది కల్పిత కథ" అని చెప్పడం, MKT కుటుంబం చేస్తున్న ఆరోపణలను డైరెక్ట్‌గా ఖండించడానికే అని అర్థమవుతోంది.
రిలీజ్ కోసమే రానా క్లారిటీ?
చెన్నై కోర్టు ఈ పిటిషన్‌పై నవంబర్ 18 లోగా సమాధానం చెప్పాలని 'కాంత' టీమ్‌ను ఆదేశించింది. కానీ, సినిమా రిలీజ్ 14నే ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, ముందుగా ఆడియన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇవ్వడానికే రానా ఈ పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చారని స్పష్టమవుతోంది.
మొత్తం మీద, రానా "ఇది ఫిక్షన్" అని పబ్లిక్ క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ, MKT కుటుంబ సభ్యులను ఈ స్టేట్‌మెంట్ శాటిస్‌ఫై చేస్తుందా? కోర్టు ఈ వాదనను అంగీకరిస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

