పళ్లు తోమడానికే కాదు.. మీ ఇంట్లో చాలా వస్తువులకు టూత్‌పేస్ట్‌తో మెరుపు తీసుకురావచ్చు! మీ ఫోన్ స్క్రీన్ గీతలకు కూడా ఇదే మందు అని మీకు తెలుసా?
సాధారణంగా పళ్లను శుభ్రం చేసుకోవడానికి, నోటిని తాజాగా ఉంచుకోవడానికి మాత్రమే టూత్‌పేస్ట్‌ను వాడుతాం. కానీ మీ ఇంట్లో ఉండే ఈ టూత్‌పేస్ట్, దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. టూత్‌పేస్ట్‌లో ఉండే శుభ్రపరిచే ఏజెంట్లు, మెంథాల్, బేకింగ్ సోడా వంటి పదార్థాలు మరకలను, దుర్వాసనను తొలగించి, వస్తువులకు మెరుపునిస్తాయి.
తెల్లటి బూట్లకు కొత్త మెరుపు
మీ తెల్లటి బూట్లు లేదా స్నీకర్స్‌పై మరకలు పడి మురికిగా కనిపిస్తున్నాయా? కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి పాత బ్రష్‌తో రుద్దండి. నిమిషాల్లోనే మీ షూలు వెంటనే కొత్తవాటిలా మెరుస్తాయి.
ఫోన్ స్క్రీన్ గీతలకు చెక్
మీ ఫోన్ స్క్రీన్ లేదా వాచ్ గ్లాస్‌పై పడిన చిన్న గీతలతో ఇబ్బంది పడుతున్నారా? టూత్‌పేస్ట్‌ను మెత్తటి గుడ్డపై కొద్దిగా తీసుకుని, గీతలు ఉన్నచోట మెల్లగా రుద్దండి. గీతలు తగ్గి, స్క్రీన్ మెరుస్తుంది.
కుళాయిలు, అద్దాలపై మరకలకు..
బాత్రూమ్ అద్దాలు, స్టీల్ కుళాయిలపై పేరుకుపోయే నీటి మరకలు, గారను తొలగించడానికి టూత్‌పేస్ట్ బాగా పనిచేస్తుంది. వాటిని టూత్‌పేస్ట్‌తో క్లీన్ చేస్తే మరకలు సులభంగా తొలగిపోయి, కొత్త వాటిలా మెరుస్తాయి.
బట్టలపై ఇంక్ మరకలు
బట్టలపై పెన్ ఇంక్, ఆహారం లేదా చిన్నపాటి నూనె మరకలు పడినప్పుడు టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది. మరకపై టూత్‌పేస్ట్‌ను పూసి, మెల్లగా రుద్ది, ఆపై నీటితో కడిగేస్తే, ఆ మరకలు పోతాయి. (గమనిక: ఇది చిన్న, తేలికపాటి మరకలకు మాత్రమే పని చేస్తుంది).
వెండి, ఇత్తడి వస్తువుల మెరుపు కోసం
నల్లబడిన వెండి ఆభరణాలు లేదా ఇత్తడి, ఉక్కు పాత్రలకు మెరుపు తీసుకురావడానికి టూత్‌పేస్ట్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నల్లబడిన వస్తువులపై టూత్‌పేస్ట్‌ను పూసి రుద్దితే, ఆక్సైడ్ పొర తొలగిపోయి, అవి మళ్లీ కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
అసలు ప్రయోజనం మర్చిపోవద్దు
టూత్‌పేస్ట్‌కు ఎన్ని ఉపయోగాలు ఉన్నా, దాని ప్రధాన ప్రయోజనం దంత ఆరోగ్యాన్ని కాపాడటమే. ఇందులో ఉండే ఫ్లోరైడ్ దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది, క్షయాన్ని నివారిస్తుంది. కాబట్టి, మీ టూత్‌పేస్ట్‌ను ఇంటి శుభ్రతకు ఉపయోగిస్తూనే, సరైన బ్రష్‌తో రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.

