ఏపీ అన్నదాతలకు గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)తో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వక కలయిక కాదు.. ఏపీ రైతుల దశ తిరిగే ప్లాన్! కొబ్బరి నుంచి మఖానా వరకు.. బాబు లిస్ట్ చాంతాడంత ఉంది. ఇంతకీ కేంద్రం నుంచి ఏపీ ఏం ఆశిస్తోంది? ఈ భేటీతో రైతులకు జరిగే మేలు ఎంత?
9.9% వాటా.. కేంద్రం స్పెషల్ ఫోకస్
దేశ వ్యవసాయ జీడీపీలో ఏపీ వాటా ఏకంగా 9.9 శాతం. ఈ నంబర్ చూసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కూడా ఫిదా అయ్యారు. చంద్రబాబు విజన్ కు తగ్గట్టుగా.. రాష్ట్ర అవసరాలకు ఒక 'స్పెషల్ యాక్షన్ ప్లాన్' (Action Plan), వాల్యూ ఎడిషన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంటే త్వరలోనే ఏపీ వ్యవసాయానికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు లేదా పథకాలు వచ్చే ఛాన్స్ ఉంది.
కొబ్బరి రైతులకు జాక్ పాట్?
కోనసీమ కొబ్బరి రైతులకు శుభవార్త. కొబ్బరి సాగును డెవలప్ చేయడానికి రూ.200 కోట్ల సాయం కావాలని బాబు కోరారు.
ప్లాన్: కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు.
డిమాండ్: కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, రైతులకు ఆధునాతన పద్ధతులపై ట్రైనింగ్. ఇది అమలైతే కొబ్బరి రైతులకు మంచి రేటు దొరకడమే కాదు, ఎగుమతులు కూడా పెరుగుతాయి.
కొల్లేరులో 'మఖానా' మ్యాజిక్!
ఉత్తరాదిలో పండే 'మఖానా' (Makhana) ఇప్పుడు ఏపీలోనూ పండబోతోంది. కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాలు దీనికి అనుకూలంగా ఉందని చంద్రబాబు గుర్తించారు. అందుకే ఏపీలో 'మఖానా డెవలప్‌మెంట్ బోర్డు' ఏర్పాటు చేయాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ఇది వర్కౌట్ అయితే ఆక్వా రైతులకు ఇదో అద్భుతమైన ప్రత్యామ్నాయం అవుతుంది.
పెండింగ్ నిధులు.. రసాయనాలు బంద్
రాష్ట్రంలో రసాయన ఎరువుల వాడకం 2.28% తగ్గింది. అందుకే 'పీఎం-ప్రణామ్' (PM-PRANAM) కింద ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరారు. అలాగే:
'పర్ డ్రాప్ మోర్ క్రాప్' కింద పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లు.
తోతాపూరి మామిడి రైతుల కోసం (2025-26 సీజన్) రూ.100 కోట్లు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు గట్టిగా విజ్ఞప్తి చేశారు.
విజన్ 2047లో వ్యవసాయమే కీలకం!
బాబు ప్లాన్ క్లియర్ గా ఉంది. సంప్రదాయ పంటలతో పాటు కమర్షియల్ క్రాప్స్ (మఖానా) వైపు రైతులను మళ్లించడం, కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా రాబట్టడం. శివరాజ్ సింగ్ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే.. రాబోయే బడ్జెట్ లో ఏపీ రైతులకు పండగే అనిపిస్తోంది.

