మృణాల్ ఠాకూర్ మాజీ ప్రియుడికి హృతిక్ ఫోబియా!

naveen
By -

ప్రేమలో ఇన్సెక్యూరిటీ (అభద్రతాభావం) అనేది ఎంతటి బంధాన్నైనా నాశనం చేస్తుంది. సామాన్యులకే కాదు, సెలబ్రిటీల జీవితాల్లోనూ ఇది కామన్. అసలు మీ పార్ట్‌నర్ వేరే వాళ్లతో పనిచేస్తుంటే.. వాళ్ల అందం చూసి మీరు కుళ్లుకుంటారా? అయితే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పిన ఈ రియల్ లైఫ్ స్టోరీ మీరు కచ్చితంగా చదవాల్సిందే. రేపు (ఫిబ్రవరి 20) విడుదల కానున్న 'దో దీవానే షెహర్ మే' ప్రమోషన్స్‌లో తన మాజీ ప్రియుడి గురించి మృణాల్ చెప్పిన ఓ చేదు నిజం ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతోంది. అసలు హృతిక్ రోషన్ వల్ల మృణాల్ బ్రేకప్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? 


మృణాల్ ఠాకూర్


అందగాడితో నటిస్తోందని.. 


సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ (Do Deewane Sheher Mein) విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేమ, బ్రేకప్స్ పై ఆమె ఓపెన్ అయ్యారు. 2019లో తాను 'సూపర్ 30' సినిమా చేస్తున్నప్పుడు తన స్కాండినేవియన్ బాయ్ ఫ్రెండ్ పడిన టెన్షన్ ను బయటపెట్టారు.


ఆ సినిమాలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి నటించడం ఆ ప్రియుడికి ఏమాత్రం నచ్చలేదట. హృతిక్ లాంటి అందగాడితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే.. ఆ బాయ్ ఫ్రెండ్ తీవ్రమైన ఇన్సెక్యూరిటీకి లోనయ్యాడట. హృతిక్ కు ఏమాత్రం తీసిపోకూడదని పిచ్చిగా వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు.


17 కిలోలు తగ్గి.. 20 కిలోలు పెరిగి! 


ఆ కసిలో ఏకంగా 15 నుంచి 17 కిలోల బరువు తగ్గాడు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై వర్కౌట్స్ మానేశాడు. ఫలితంగా తగ్గిన బరువు కాస్తా రివర్స్ కొట్టి ఏకంగా 20 కిలోలు పెరిగిపోయాడు.


ఇదంతా కేవలం ఇన్సెక్యూరిటీ వల్లే జరిగిందని, తాను మారమని ఎప్పుడూ అడగలేదని మృణాల్ క్లారిటీ ఇచ్చారు. పక్కన అందమైన మగాళ్లు ఉంటే తట్టుకోలేని ఆ అభద్రతాభావమే అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శరద్ త్రిపాఠీ, బాద్ షా లాంటి వాళ్లతో మృణాల్ పేరు వినిపించినా.. ఈ స్టోరీ వాళ్ల గురించి కాదని తెలుస్తోంది.


ప్రమోషన్ స్టంటా? పచ్చి నిజమా? 


మృణాల్ చెప్పిన ఈ స్టోరీపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. కొందరు ఆ అబ్బాయి పరిస్థితిని అర్థం చేసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం రేపు రిలీజ్ కాబోయే సినిమా కోసం మృణాల్ ఇదంతా 'పీఆర్ స్టంట్' (PR Stunt) చేస్తోందని విమర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసం పర్సనల్ విషయాలు లాగడం కరెక్ట్ కాదని క్లాస్ పీకుతున్నారు.


ఇన్సెక్యూరిటీ.. ఒక సైలెంట్ కిల్లర్! 


పక్కవాళ్లతో పోల్చుకుని మనల్ని మనం తగ్గించుకోవడం ఎంతటి మూర్ఖత్వమో మృణాల్ స్టోరీ చెబుతోంది. బంధంలో నమ్మకం ముఖ్యం కానీ.. ఒక హృతిక్ రోషన్ వస్తాడనో, మరొకరు వస్తారనో భయపడితే అది ప్రేమే కాదు. ఎదుటివ్యక్తి అందాన్ని చూసి మన బంధాన్ని అనుమానిస్తే.. ఆ బంధం ఏనాటికైనా పేకమేడలా కూలిపోవడం ఖాయం.


ఇది కూడా చదవండి (Also Read):

Kalyani Priyadarshan Loka 2 Update | లోక 2 అప్డేట్
Tags: