ప్రపంచ దేశాల అధినేతలు కలిసినప్పుడు సాధారణంగా మొక్కుబడిగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. కానీ, ఇజ్రాయెల్ గడ్డపై ప్రధాని మోదీకి ఎదురైన ఆత్మీయ స్వాగతం చూస్తే.. ఇది రెండు దేశాల మధ్య దౌత్యం కాదు, ఇద్దరు ప్రాణ స్నేహితుల కలయిక అనిపిస్తుంది. ఇంతకీ విమానాశ్రయంలో ఆ 'కాషాయ' రంగు డ్రెస్ వెనుక దాగిన ఆంతర్యం ఏంటి? ఈ స్నేహం సామాన్య భారతీయుడికి, దేశ భద్రతకు ఎలా శ్రీరామరక్షగా మారబోతోందో తెలుసా?
దౌత్యం కాదు.. ప్రాణ స్నేహం!
ఫిబ్రవరి 25న (బుధవారం) టెల్ అవీవ్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా స్వయంగా వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న సరదా సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మోదీ తన తెల్లటి కుర్తాపై కాషాయ రంగు పాకెట్ స్క్వేర్ ధరించగా, యాదృచ్ఛికంగా సారా నెతన్యాహు కూడా అదే రంగు డ్రెస్ వేసుకున్నారు. ఇది గమనించిన నెతన్యాహు.. "చూశారా ఆమె ఏ డ్రెస్ వేసుకుందో?" అని సరదాగా చమత్కరించగా, దానికి మోదీ నవ్వుతూ "అవును కాషాయ రంగు" అని బదులివ్వడం ఈ రెండు దేశాల మధ్య ఉన్న చనువుకు అద్దం పడుతోంది.
Welcome to Israel my dear friend @narendramodi 🇮🇱🙏🇮🇳 pic.twitter.com/AnRtceD9Ci
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) February 25, 2026
కుర్తా పైజామాలో నెతన్యాహు సర్ ప్రైజ్
ఈ ఆత్మీయత కేవలం ఎయిర్‌పోర్ట్‌కే పరిమితం కాలేదు. రాత్రి జరిగిన సంయుక్త విందులో తన ప్రాణ స్నేహితుడు మోదీని ఆశ్చర్యపరచడానికి నెతన్యాహు ఏకంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావడం విశేషం.
"నా స్నేహితుడి కోసం ఇలా రెడీ అయ్యాను" అంటూ ఆయన పెట్టిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సారా నెతన్యాహు భారత్‌ను "అద్భుతమైన దేశం" అని కొనియాడటం ఈ బంధం దృఢత్వాన్ని సూచిస్తోంది. ఇజ్రాయెల్ ప్రజల్లో భారత్ పట్ల ఉన్న గౌరవానికి ఇదొక ప్రతీక.
हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) February 25, 2026
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో చరిత్ర
ఈ పర్యటనలో మోదీ మరో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ 'క్నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా రికార్డులకెక్కారు.
ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని మోదీ కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో ఇరు దేశాల స్టాండ్ ఒకటేనని ఈ ప్రసంగం ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపారు.
వ్యక్తిగత స్నేహమే.. జాతీయ భద్రత!
నాయకుల మధ్య ఉండే పర్సనల్ కెమిస్ట్రీ విదేశీ వ్యవహారాల్లో ఎంత మ్యాజిక్ చేస్తుందో చెప్పడానికి మోదీ-నెతన్యాహు దోస్తీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇజ్రాయెల్ తో ఈ స్థాయి స్నేహం ఉంటే.. మనకు వ్యవసాయం, వాటర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అత్యాధునిక రక్షణ ఆయుధాలు సులువుగా అందుతాయి. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేసే ఇజ్రాయెల్ అండగా ఉండటం వల్లే.. రేపు మన దేశంలోకి ఏ ఉగ్రవాది అడుగుపెట్టాలన్నా వణికిపోయే పరిస్థితి వస్తుంది. సామాన్యుడు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ దౌత్య ఆలింగనాలే అసలైన పునాది!

