శర్వానంద్ రేస్ కు రాజశేఖర్ బూస్ట్.. 'బుల్లెట్ సునీల్' వచ్చేశాడు! టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్..
టాలీవుడ్ స్క్రీన్ మీద కార్ రేసింగ్ లు చూశాం, గుర్రపు పందాలు చూశాం. కానీ ఫస్ట్ టైమ్ ఒక పూర్తి స్థాయి బైక్ రేసింగ్ సినిమా రాబోతోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న 'బైకర్' (Biker) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ రేస్ లో శర్వాకు జోడీగా ఒక సీనియర్ స్టార్ తోడయ్యారు. ఆయనే యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar). తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన రాజశేఖర్ పాత్ర గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి థియేటర్లలో సౌండ్ గట్టిగా ఉండేలా ఉంది. ఇంతకీ ఎవరు ఈ బుల్లెట్ సునీల్? శర్వానంద్ కు ఈయనకు ఉన్న లింక్ ఏంటి?
బుల్లెట్ సునీల్.. పేరులోనే వైబ్రేషన్
ఈ సినిమాలో రాజశేఖర్ పోషిస్తున్న పాత్ర పేరు 'బుల్లెట్ సునీల్'. గ్లింప్స్ లో ఆయన లుక్, యాటిట్యూడ్ చూస్తుంటే పాత రాజశేఖర్ మళ్లీ గుర్తొస్తున్నారు. ఒకప్పుడు మోటోక్రాస్ రేసర్ గా దుమ్మురేపిన బుల్లెట్ సునీల్.. ఇప్పుడు కోచ్ గా మారినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ ఛాంపియన్ షిప్ లో ఇండియా జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ఆయన పాత్ర సాగుతుంది. దేశం కోసం, గెలుపు కోసం ఒక మాజీ ఛాంపియన్ పడే ఆరాటాన్ని రాజశేఖర్ కళ్ళలో చూపించారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ రోల్ దక్కిందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
గురువుగా యాంగ్రీ స్టార్.. శిష్యుడిగా చార్మింగ్ స్టార్
ఈ కథ ప్రధానంగా గురుశిష్యుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతోంది. రేసింగ్ ట్రాక్ మీద శర్వానంద్ స్పీడ్ కు, రాజశేఖర్ అనుభవం తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించబోతోంది. ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. స్లిమ్ లుక్ లో రేసర్ గా ఆయన లుక్ అదిరిపోయింది. రాజశేఖర్ ఇచ్చే ట్రైనింగ్, శర్వానంద్ చేసే సాహసాలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఒక కొత్త జోనర్ ను పరిచయం చేయబోతోంది.
సమ్మర్ రేస్ కు డేట్ ఫిక్స్
యూవీ క్రియేషన్స్ (UV Creations) లాంటి పెద్ద బ్యానర్ నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్స్ కు ప్రాణం పోయనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సమ్మర్ హాలిడేస్ లో రాబోతున్న ఈ 'బైకర్'.. బాక్సాఫీస్ రేస్ లో ఎంత వేగంగా దూసుకెళ్తాడో చూడాలి.
స్పీడ్ కు ఎమోషన్ తోడైతే.. రిజల్ట్ అదిరిపోద్ది!
రొటీన్ సినిమాలకు బోర్ కొట్టిన వారికి 'బైకర్' ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. రాజశేఖర్, శర్వానంద్ కాంబినేషన్ ఈ సినిమాకు అసలైన ఇంధనం!
Happy Birthday @ActorRajasekhar garu 🤗
— Sharwanand (@ImSharwanand) February 4, 2026
It’s an absolute privilege to have you playing BULLET SUNIL in #Biker Sir! https://t.co/Ga8b0xX9NJ

