బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు రక్తం పారుతోంది.. అదే సమయంలో నవ్వుల జల్లు కూడా కురవబోతోంది! ఒకవైపు థియేటర్లను షేక్ చేస్తున్న రణవీర్ సింగ్ రా అండ్ రస్టిక్ యాక్షన్.. మరోవైపు పాత జ్ఞాపకాలను తట్టిలేపుతూ వస్తున్న అక్షయ్ కుమార్ హారర్ కామెడీ. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఈ రెండింటి మధ్యే అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ధురందర్ రికార్డుల వేట.. అక్షయ్ ప్రశంసల జల్లు
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సృస్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ, భారతీయ సినిమాను ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసల వర్షం కురిపించాడు.
అది పెద్దలకే.. ఇది అందరికీ!
అయితే, సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు అక్షయ్. రణవీర్ 'ధురందర్' కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ యాక్షన్ సినిమా అని తేల్చిచెప్పాడు. అందులో వాస్తవికత, వైలెన్స్ చాలా ఎక్కువని, అది పిల్లలు చూసే సినిమా కాదని కుండబద్దలు కొట్టాడు. కానీ, తాను త్వరలో తీసుకురాబోతున్న 'భూత్ బంగ్లా' మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కడుపుబ్బా నవ్వుకునే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని గర్వంగా ప్రకటించాడు.
పాత టాకీసుల గోల్డెన్ రోజులు మళ్లీ వస్తున్నాయి!
సరిగ్గా ఇక్కడే మనకు ఒకప్పటి తీయ్యటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎనభై, తొంభైల దశకంలో పాత టాకీసుల్లో కుటుంబమంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసిన ఆ గోల్డెన్ రోజులు మళ్లీ రాబోతున్నాయి. 2007లో వచ్చిన 'భూల్ భులయ్యా' తరహాలో.. దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్ అనే దిగ్గజ త్రయం మళ్లీ కలుస్తోంది. అప్పట్లో ఆ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎంతటి నవ్వుల విస్ఫోటనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు 'భూత్ బంగ్లా'తో ఆ నాటి వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 10న అసలైన పండగ
శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ భారీ హారర్ కామెడీ చిత్రంలో టబు, రాజ్‌పాల్ యాదవ్, మిథిలా పాల్కర్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఫారా షేక్, వేదాంత్ బాలి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాల సునామీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతోంది.
ఒకవైపు రణవీర్ రక్తపాతం.. మరోవైపు అక్షయ్ నవ్వుల యాగం. బాక్సాఫీస్ వద్ద ఈ వేసవి ఎవరిది కాబోతుందో ఏప్రిల్ 10న తేలిపోనుంది!
Also Read:
Ranveer Singh Dhurandhar 2 Collections: కంటెంట్ సత్తా.. తెలుగులో ఆదరణ చూసి షాక్ లో బాలీవుడ్ మేకర్స్!Box Office Report: ఉగాది బరిలో 'ధురంధర్ 2' సునామీ.. బాక్సాఫీస్ దాటికి విలవిలలాడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
Dhurandhar 2: బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లుతున్న థియేటర్లు.. కానీ బాలీవుడ్లో ఆ అంతుచిక్కని 'నిశ్శబ్దం' వెనుక కథేంటి?
Peddi Release Tension: వాయిదాల వలయంలో చరణ్ 'పెద్ది'.. ఏప్రిల్ 30 పక్కానా? ఫిల్మ్ నగర్ గ్రౌండ్ రిపోర్ట్!
Gaddar Awards: హైటెక్స్‌లో దద్దరిల్లిన మెగా మేనియా.. 'అన్నగారి' పురస్కారం అందుకున్న 'అన్నయ్య'!

