T20 World Cup 2026: సంజూ ఎంట్రీ, అభిషేక్‌కు సపోర్ట్.. టీమిండియా అద్భుత విజయం వెనుక గంభీర్ 'మాస్టర్ ప్లాన్' ఇదే!
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విశ్వవిజేతగా నిలవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా రివీల్ చేశారు. టోర్నీ మధ్యలో సంజూ శాంసన్‌ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు తానెలా దైర్యం చెప్పారు? లాంటి ఆసక్తికర విషయాలను 'జియో స్టార్'తో జరిగిన ఇంటర్వ్యూలో గంభీర్ పంచుకున్నారు. టీమిండియా సరికొత్త 'అగ్రెసివ్' బ్యాటింగ్ ఫిలాసఫీ ఏంటో ఆయన మాటల్లోనే వివరంగా చూద్దాం.
టార్గెట్ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కాదు.. విధ్వంసమే!
భారత టాప్ ఆర్డర్‌లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ఆ క్రమాన్ని మార్చడానికే (లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం) సంజూ శాంసన్‌ను తీసుకున్నారన్న వార్తలను గంభీర్ కొట్టిపారేశారు. ఈ నిర్ణయం కేవలం అగ్రెసివ్ బ్యాటింగ్ కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
- పవర్‌ప్లే ప్లాన్: "గత ఏడాదిన్నర కాలంగా మా ఆలోచన ఒక్కటే. క్రీజులోకి వెళ్ళామా, విధ్వంసం సృష్టించామా అన్నట్లుగా ఆడాలి. పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే సంజూని బరిలోకి దింపాం."
- క్వాలిటీ బ్యాటర్: నా దృష్టిలో ఒక క్వాలిటీ బ్యాటర్ ఏ రకమైన బౌలర్నైనా ఎదుర్కోగలగాలి. మొదటి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీయడమే మా లక్ష్యం అని గంభీర్ చెప్పుకొచ్చారు.
జిమ్‌లో క్యాజువల్ ఎంట్రీ
సంజూకు జట్టులో చోటు దక్కిన విషయాన్ని తాను ఎంతో క్యాజువల్‌గా చెప్పినట్లు గంభీర్ వెల్లడించారు. జింబాబ్వే మ్యాచ్‌కు ముందు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో.. "రేపు నువ్వు ఆడుతున్నావు సంజూ" అని చెబితే, సంజూ కూడా అంతే కూల్‌గా "రానివ్వండి చూసుకుందాం" అని బదులిచ్చినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. కోచ్-ప్లేయర్ లా కాకుండా ఒక స్నేహితుడిలా తాను ఆటగాళ్లతో ఉంటానని తెలిపారు.
ఆ లైనప్ ఉంటే బౌలర్లకు దడే!
భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ గురించి గంభీర్ గొప్పగా విశ్లేషించారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి టాప్-3 బ్యాటర్లు ఉండి.. ఆ తర్వాత మిడిలార్డర్‌లో ఏమాత్రం భయం లేకుండా ఆడే పవర్ హిట్టర్లు ఉంటే, ఆ లైనప్ ఏ బౌలర్లకైనా పీడకలే అని ఆయన ప్రశ్నించారు.
సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్యా
తిలక్ వర్మ
శివం దూబే
అక్షర్ పటేల్
ఇంతకంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఇంకేముంటుందని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు.
అభిషేక్‌కు గంభీర్ ఇచ్చిన 'గబ్బర్' బూస్ట్
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలకు కూడా గంభీర్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2014 ఐపీఎల్‌లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన తన సొంత అనుభవాన్ని గుర్తు చేస్తూ అభిషేక్ కు అండగా నిలిచారు.
"నువ్వు ఫామ్‌లో లేవని జనం అంటారు, కానీ నువ్వు కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నావు. క్రీజులో 20-30 బంతులు ఆడితే తప్ప ఎవరి ఫామ్‌ను జడ్జ్ చేయలేం. లోకం ఏమనుకుంటుందో నీకు అనవసరం, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న 30 మంది నీ గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. మొదటి బంతికే సిక్స్ కొట్టాలనిపిస్తే ఏమాత్రం సంకోచం లేకుండా కొట్టేయ్!"
గౌతమ్ గంభీర్ ఇస్తున్న ఈ స్వేచ్ఛ, ఆటగాళ్లపై ఆయన ఉంచిన నమ్మకమే టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భయం లేని క్రికెట్ ఆడటమే గంభీర్ అసలు సిసలైన మాస్టర్ ప్లాన్.

