India Russian Oil Waiver: సామాన్యుడికి అమెరికా గుడ్ న్యూస్.. 30 రోజుల పాటు రష్యా ఆయిల్‌కు అనుమతి

naveen
By -

గల్ఫ్ దేశాల్లో బాంబులు పడుతుంటే.. మన వరంగల్, హైదరాబాద్ బంకుల్లో పెట్రోల్ దొరకదేమోనని భయపడుతున్న సామాన్యుడికి అమెరికా ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన ముడి చమురు ఆగిపోయిన విపత్కర పరిస్థితుల్లో.. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి ఇండియాకు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. అసలు సముద్రంలో ఆగిపోయిన ఆ లక్షలాది బ్యారెళ్ల ఆయిల్ కథేంటి? అమెరికా పెట్టిన ఆ ఒక్క కండిషన్ వల్ల 30 రోజుల తర్వాత మన దేశంలో పెట్రోల్ రేట్లు ఏమవుతాయో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.


India Russian Oil Waiver


హోర్ముజ్ జలసంధి బ్లాక్.. ఆగిపోయిన 40 శాతం ఆయిల్!


ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా క్రూడాయిల్ రవాణాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి' బ్లాక్ అవ్వడంతో ఆయిల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది.


మన భారతదేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 40 శాతం ఆ మార్గం గుండానే రావాలి. ఈ సప్లై ఆగిపోవడంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళన తీవ్రమైంది.


30 రోజుల పాటు రష్యా ఆయిల్‌కు గ్రీన్ సిగ్నల్


ఈ పెను ముప్పు నుంచి భారత్‌ను, గ్లోబల్ మార్కెట్‌ను కాపాడేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది. రష్యా ఆయిల్ కొనుగోలుపై ఉన్న కఠిన ఆంక్షలను సడలిస్తూ.. ఇండియాకు 30 రోజుల ప్రత్యేక మినహాయింపు (Waiver) ఇచ్చింది.


దీంతో సముద్రంలో, మార్గమధ్యలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మిలియన్ల బ్యారెళ్ల రష్యా ఆయిల్‌ను ఇండియా ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా తెచ్చుకునే వెసులుబాటు కలిగింది.


అమెరికా పెట్టిన ఆ 'ఒక్క' కండిషన్ ఇదే!


భారత్‌కు మినహాయింపు ఇచ్చినప్పటికీ అమెరికా ఒక మెలిక పెట్టింది. ఇది కేవలం ఇప్పటికే ఓడల్లో లోడ్ అయ్యి, సముద్రంలో ఆగిపోయిన రష్యా ఆయిల్‌కు మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా ఆర్డర్లు ఇవ్వడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.


ప్రపంచ ఇంధన సరఫరాను ఇరాన్ కావాలనే బందీగా చేయాలని చూస్తోందని.. దాన్ని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ (Scott Bessent) స్పష్టం చేశారు. రష్యాకు ఆర్థిక లాభం చేకూర్చడం తమ ఉద్దేశం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.


అమెరికా ఇచ్చిన ఈ 30 రోజుల గడువు వల్ల ప్రస్తుతానికి మన బంకుల్లో పెట్రోల్ కొరత, ధరల పెంపు ముప్పు తప్పింది. కానీ, ఇది కేవలం తాత్కాలిక బ్యాండేజ్ మాత్రమే! ఇరాన్ యుద్ధం ఇలాగే కొనసాగితే నెల రోజుల తర్వాత ఇండియా పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది.