మీ పడకగదిలో మీరు అత్యంత ఏకాంతంగా, సురక్షితంగా ఉన్నామని అనుకుంటున్నారా? మీ కష్టార్జితంతో కొనుక్కున్న ఆ ఖరీదైన స్మార్ట్ టీవీ.. ఒక నిశ్శబ్ద గూఢచారిలా మారి మీ వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేస్తోందన్న భయంకరమైన వాస్తవం మీకు తెలుసా! వినోదం పేరుతో మీ ఇంట్లో వాలిన ఈ ఎలక్ట్రానిక్ యంత్రం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి పర్సనల్ ఫోటోల వరకు ప్రతిదీ ఎలా దొంగిలిస్తోందో ప్రతి సామాన్యుడూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం ఇది.
ఏసీఆర్ (ACR) టెక్నాలజీ.. కంటికి కనిపించని నిఘా నేత్రం!
స్మార్ట్ టీవీలలో దాగి ఉన్న 'ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్' (ACR) అనే భయంకరమైన ఫీచరే ఈ సైలెంట్ క్రైమ్‌కు ప్రధాన కారణం. ఇది కేవలం ఒక ఫీచర్ కాదు, మీ టీవీ స్క్రీన్‌పై కదిలే ప్రతి అణువును స్కాన్ చేసే ఒక డేటా రాక్షసుడు.
మీరు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తున్నా, యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నా, కనీసం లాప్‌టాప్‌ను హెచ్‌డీఎమ్‌ఐ (HDMI) కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి చూస్తున్నా సరే ఇది ఏమాత్రం వదిలిపెట్టదు. ఆడియో, పిక్సెల్స్‌ను క్షణాల్లో స్కాన్ చేసి ఒక 'డిజిటల్ ఫింగర్‌ప్రింట్' (మెటా డేటా)గా మార్చేస్తుంది.
ఇలా సేకరించిన మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ అలవాట్లను, మీ అభిరుచులను గుట్టుచప్పుడు కాకుండా నేరుగా టీవీ తయారీ సంస్థల సర్వర్లకు చేరవేస్తుంది.
ప్రైవసీ సెట్టింగ్స్ మార్చినా లాభం లేదు.. ఎందుకంటే!
చాలామంది యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ యాప్స్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుందని భ్రమపడతారు. కానీ అసలు ప్రమాదం ఆ టీవీ హార్డ్‌వేర్‌లోనే ప్రాణం పోసుకుని ఉందని సైబర్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ పరిశోధనలో కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి అగ్రశ్రేణి కంపెనీల టీవీలను కేవలం ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేగా (ల్యాప్‌టాప్‌కు స్క్రీన్‌లా) వాడుతున్నా సరే, అవి మన డేటాను దొంగిలిస్తున్నట్లు తేలింది.
మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా సేఫ్ కాదు!
"టీవీ హార్డ్‌వేర్ నేరుగా పిక్సెల్స్‌ను పసిగడుతుంది. మీరు టీవీకి ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసి మీ పర్సనల్ ఫొటోలు చూసుకున్నా, లేదా బ్యాంకింగ్ స్టేట్‌మెంట్స్ లాంటి అత్యంత సున్నితమైన డాక్యుమెంట్లు ఓపెన్ చేసినా ఊహించని ప్రమాదమే" అని '63శాట్స్ సైబర్ టెక్' సీఈఓ నీహార్ పఠారే తీవ్రంగా హెచ్చరించారు.
ఆ క్షణంలో మీ స్క్రీన్‌పై కనిపించే ఆ సున్నితమైన డేటా మొత్తం, ఈ టెక్నాలజీ గుప్పిట్లోకి అత్యంత సునాయాసంగా వెళ్లిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
మీ గోప్యతే వారి వేల కోట్ల వ్యాపారం!
కంపెనీలు ఈ డేటాను ఊరికే తమ సర్వర్లలో దాచుకోవు.. దానిని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు కోట్ల రూపాయలకు విక్రయిస్తాయి. సామాన్యుడి ప్రైవసీయే వారి అసలైన వ్యాపారం.
మీరు టీవీలో ఏదైనా కంటెంట్ చూసిన వెంటనే.. దానికి సంబంధించిన ప్రకటనలే మీ మొబైల్‌లో, సోషల్ మీడియాలో పదేపదే కనిపించడం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ డిజిటల్ నిఘా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే వెంటనే అప్రమత్తం కావాలి. టీవీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ACR' లేదా 'వ్యూయింగ్ డేటా' లేదా 'అడ్వర్టైజింగ్' అనే ఆప్షన్లను వెతికిపట్టి వెంటనే వాటిని డిసేబుల్ చేయండి. కొత్త టీవీ కొన్నప్పుడు కళ్లు మూసుకుని అన్ని నిబంధనలకు 'అగ్రీ' (Agree) నొక్కకండి. ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు వైఫై డిస్‌కనెక్ట్ చేసి ఉంచడం మీ చేతుల్లో ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం! స్మార్ట్ యుగంలో మనమే మరింత స్మార్ట్‌గా ఉంటేనే మన గోప్యతకు భద్రత ఉంటుంది.
Also Read:
Assam Exit Polls | అస్సాంలో మళ్లీ ఎన్డీఏ సునామీ: కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్!Abhishek Banerjee | మమత నీడ నుంచి కింగ్‌మేకర్‌గా.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రస్థానం!
Meghalaya Murder Case : పోలీసుల చిన్న తప్పు.. భర్తను చంపిన భార్యకు బెయిల్!
Bengal Elections : బెంగాల్ పోలింగ్‌లో హై-వోల్టేజ్ డ్రామా
Tamil Nadu Election Results: కింగ్ మేకర్‌గా దళపతి విజయ్

