సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఖాయమేనా?

naveen
By -
ఫ్యాన్స్‌కు పండగే: సూర్య సినిమాపై నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' రేపు (ఆగస్టు 14) థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఆరేళ్లలో తమ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో దీనిపై ఉన్నంత కాన్ఫిడెన్స్ దేనిపైనా లేదని, ఇది కచ్చితంగా తమకు మరో 'అల వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


[FEATURED_IMAGE]

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక పక్క గజిని సినిమాలోని 'సంజయ్ రామస్వామి'ని గుర్తుచేసేలా సూర్య క్యారెక్టరైజేషన్‌ డిజైన్ చేసిన మేకర్స్.. అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలను అమాంతం పెంచేశారు.


ఈ సినిమాలో 40 ఏళ్ల వయసున్న స్టార్ షార్ప్ షూటర్ 'సంజయ్ విశ్వనాథ్‌' పాత్రలో సూర్య నటిస్తుండగా, 20 ఏళ్ల యువతి 'మ్యాడీ' పాత్రలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు మెరవనుంది. వీరిద్దరి మధ్య వయసు అంతరాన్ని హైలైట్ చేస్తూ సాగే ప్రేమకథ, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని '200 పర్సెంట్ బ్లాక్‌బస్టర్' అని బలంగా చెబుతున్నారు.


థియేటర్‌కు వచ్చే ప్రతి ప్రేక్షకుడిని ఈ కథ కడుపుబ్బా నవ్విస్తుందని, అలాగే కన్నీళ్లు కూడా పెట్టిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడి మనసులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' అలా నిలిచిపోతుందని, ఒక మంచి అనుభూతితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారని నాగవంశీ స్పష్టం చేశారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్, వివా హర్ష వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు.


భారీ అంచనాల మధ్య రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నాగవంశీ చెప్పినట్లుగా ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద నిజంగానే 'అల వైకుంఠపురములో' రేంజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో లేదో రేపు ఉదయానికే తేలిపోనుంది.