[FEATURED_IMAGE]
కథాంశం..
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే ప్రొఫెషనల్ పిస్టల్ షూటర్. వయసు మీద పడుతున్నా పెళ్లి పట్ల ఏమాత్రం ఆసక్తి లేని సంజయ్‌కు, ఎలాగైనా పెళ్లి చేయాలని అతని తల్లి (రాధిక శరత్‌కుమార్) నిరంతరం తాపత్రయపడుతుంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎంతో ఉత్సాహవంతమైన యువతి మ్యాడీ (మమితా బైజు) అతని జీవితంలోకి ప్రవేశించి, అతనికి దగ్గరవుతుంది. ఆ తర్వాత ఈ జంట మధ్య చోటుచేసుకున్న ఎమోషనల్ ప్రయాణం, ఫ్యామిలీ డ్రామా ఏమిటన్నదే ఈ చిత్ర కథ.
నటీనటుల పనితీరు..
తన వయసుకు సరిపోయే పాత్రలో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. తన ఛార్మ్, అలవోకైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి క్లాస్‌గా మెప్పించాడు. ఒక ఎమోషనల్ బ్రేకప్ సీన్‌లో అతనిలోని గొప్ప నటుడు బయటపడ్డాడు. ఇక ఈ సినిమాకు అతిపెద్ద బలం మమితా బైజు. ఎనర్జిటిక్ యువతి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. కామెడీ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్‌ను డామినేట్ చేసింది. సూర్య తల్లిగా రాధిక, బావమరిదిగా సునీల్ రెడ్డి మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. రవీనా టాండన్ పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించినా, ఆమె చెప్పే ఒక డైలాగ్ కాస్త వివాదాస్పదంగా అనిపిస్తుంది.
విశ్లేషణ..
కుటుంబ బంధాలు, వినోదం కలగలిపిన ఈ సినిమా మొదటి సగం ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. మమితా ఎంట్రీ తర్వాత వచ్చే కామెడీ ట్రాక్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా కూల్‌గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో రొటీన్ ఫార్ములా రైటింగ్ మొదలవడంతో మూవీ గ్రాఫ్ పడిపోయింది. ఊటీకి కథ షిఫ్ట్ అయ్యాక, లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్స్ ఇంకాస్త డెప్త్‌గా చూపించాల్సింది. కథలోని కాన్ఫ్లిక్ట్స్ (సమస్యలు) చాలా కృత్రిమంగా ఉండి, వెంటనే పరిష్కారం అవ్వడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా ఎలిగెంట్‌గా ఉండి రిచ్ ఫీల్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ట్రాక్
సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ పెర్ఫార్మన్స్
మమితా బైజు క్యూట్ అండ్ ఎనర్జిటిక్ యాక్టింగ్
ఫీల్ గుడ్ మ్యూజిక్, కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో రొటీన్, ఫార్ములా స్క్రీన్‌ప్లే
కృత్రిమంగా అనిపించే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్
తెలుగు డబ్బింగ్ పాటల లిరిక్స్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది
చివరిగా :
వీకెండ్‌లో భారీ అంచనాలు లేకుండా, ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి కుటుంబంతో కలిసి చూడదగ్గ కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీ మేకింగ్ స్టైల్, ఎమోషన్స్ చూస్తుంటే ఇది తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్‌కే ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ!

