[FEATURED_IMAGE]
'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్న వెంకీ అట్లూరి మీడియాతో ముచ్చటిస్తూ తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. బ్లాక్ బస్టర్ 'సార్' చిత్రం తర్వాత ధనుష్‌తో మరోసారి చేతులు కలపనున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ ఒక యాక్షన్ పోలీస్ డ్రామాగా రూపొందనుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, పూర్తి స్థాయి పోలీస్ కథ కావడం వల్ల రచనకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని వెంకీ స్పష్టం చేశారు. ఈ కథ పూర్తయిన వెంటనే న్యాచురల్ స్టార్ నాని కోసం సిద్ధం చేసిన మరో సినిమా స్క్రిప్ట్‌పై దృష్టి పెడతానని ఆయన తెలిపారు.
ఇక వెండితెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ యంగ్ డైరెక్టర్ అడుగుపెడుతున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే ధనుష్, నాని ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
ఈ కెరీర్ ప్రయాణంలో తనకు అండగా నిలుస్తున్న వ్యక్తుల గురించి ఆయన గొప్పగా మాట్లాడారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకు ఉన్నది గురుశిష్యుల బంధమని గుర్తుచేసుకున్నారు. అలాగే కొన్నిసార్లు బడ్జెట్ పరిమితులు దాటినా తనను నమ్మి సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

