పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు హోంబలే ఫిల్మ్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ ప్రాజెక్ట్‌పై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా కలిసి బర్త్‌డే విషెస్ చెప్పిన క్రేజీ ఫోటోను రిలీజ్ చేస్తూ, వీలైనంత త్వరలోనే ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
[FEATURED_IMAGE]పాన్ ఇండియా బాక్సాఫీస్ రారాజు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నెట్టింట ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇస్తూ పలు నిర్మాణ సంస్థల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ వస్తుండగా, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ ప్రాజెక్ట్‌పై హోంబలే ఫిల్మ్స్ ఫైనల్ క్లారిటీ ఇచ్చేసింది. ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ మాస్ ఎలివేషన్స్‌ను పీక్స్‌లో చూపించిన కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ను పర్సనల్‌గా కలిసి బర్త్‌డే విషెస్ చెప్పిన ఫొటోను అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.
విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ 'సలార్-2: శౌర్యాంగ పర్వం' సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో ఈ సీక్వెల్‌పై ఇండియా వైడ్ కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిన వెంటనే 'సలార్ 2' ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దేవా, వరదరాజ మన్నార్ మధ్య జరిగే అసలు యుద్ధం ఈ సీక్వెల్‌లోనే చూడబోతున్నాం.
ఒకవైపు సలార్ అప్‌డేట్‌తో సోషల్ మీడియా షేక్ అవుతుండగా, మరోవైపు ప్రభాస్ లైనప్‌లోని ఇతర సినిమాల అనౌన్స్‌మెంట్ల కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'ఫౌజీ' గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. నిర్మాత వై. రవిశంకర్ బర్త్‌డే రోజున కచ్చితంగా అప్‌డేట్ ఉంటుందని ముందే ప్రకటించినప్పటికీ, ఆ వీడియో రావడం కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి సలార్ 2 కన్ఫర్మేషన్‌తో పండగ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్, ఫౌజీ అఫీషియల్ గ్లింప్స్ కోసం ఊపిరి బిగబట్టి వెయిట్ చేస్తున్నారు.

