టాలీవుడ్లో ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. థియేటర్లలో తొలి సినిమా కంటెంట్ ఫ్లాప్ అయితే కష్టమే. ఇప్పుడు అగ్ర హీరోలు కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న AMR గ్రూప్ వారసుడు అనీష్ రెడ్డి 'ఇట్లు అర్జున' మూవీ హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అనీష్ ఏకంగా మాటలు రాని మూగ యువకుడిగా సాహసోపేతమైన పాత్రను ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
[FEATURED_IMAGE]ఇండస్ట్రీకి పరిచయమయ్యే కొత్త హీరోల భవిష్యత్తును వాళ్లు ఎంచుకునే తొలి కథే డిసైడ్ చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, బడా నిర్మాతల సపోర్ట్ మొదటి సినిమాకు బజ్‌ను తీసుకురాగలవు కానీ, థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టేది మాత్రం కంటెంట్ మాత్రమే. ప్రముఖ వ్యాపారవేత్త, ఏఎంఆర్ గ్రూప్ (AMR Group) అధినేత మహేష్ రెడ్డి చిన్న కుమారుడు అనీష్ రెడ్డి డెబ్యూ విషయంలో ఇప్పుడు టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది.
ఎన్టీఆర్, నాగార్జున సపోర్ట్.. కానీ అసలు సవాల్ అదే!
అనీష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న 'ఇట్లు అర్జున' సినిమాకు ఇండస్ట్రీ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా అక్కినేని నాగార్జున ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారడం విశేషం. దానికి తోడు ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడంతో ఈ డెబ్యూ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఎంతమంది పెద్దల సపోర్ట్ ఉన్నా, కంటెంట్ వీక్‌గా ఉంటే మొదటికే మోసం వస్తుందనేది సినీ విశ్లేషకుల మాట.
తొలి సినిమాకే సాహసం.. 1000 కోట్ల డీల్ మిస్టరీ!
హీరోగా లాంచ్ అయ్యేటప్పుడు ఎవరైనా సేఫ్ కమర్షియల్ మాస్ కథల వైపు మొగ్గుచూపుతారు. కానీ అనీష్ మాత్రం తన తొలి సినిమాకే మాటలు రాని యువకుడి (మూగ) పాత్రను ఎంచుకుని పెద్ద సాహసమే చేశాడు. ఇలాంటి పాత్రలకు డైలాగ్స్ ఉండవు కాబట్టి, కేవలం ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ద్వారానే ఎమోషన్ పండించాలి. ట్రైలర్ ప్రకారం చూస్తే.. ఒక మిస్టరీ పెన్‌డ్రైవ్, వెయ్యి కోట్ల డీల్ చుట్టూ ఈ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సాగనున్నట్లు తెలుస్తోంది.
కొత్త హీరో కాబట్టి ఎలివేషన్ల పేరుతో కథలో అనవసరమైన హంగులు జోడిస్తే లాజిక్ మిస్సయ్యే ప్రమాదం ఉంది. అనీష్ రెడ్డికి ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్, మంచి టీమ్ దొరకడం ఒక ఎత్తు అయితే.. మూగవాడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు. మరి ఇంతటి భారీ బ్యాకప్‌తో వస్తున్న అనీష్.. తొలి అడుగుతోనే తన స్టామినా నిరూపించుకుని టాలీవుడ్లో గట్టిగా నిలదొక్కుకుంటాడా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.

