సూపర్ స్టార్ రజనీకాంత్, యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ దీపావళి స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతిలో తుపాకీ, రక్తపాతం లాంటి భారీ హంగులేమీ లేకుండా.. బ్లూ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, కళ్లద్దాలతో మెడలోని చైన్ సరిచేసుకుంటూ రజనీ ఇచ్చిన క్లాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 75 ఏళ్ల వయసులోనూ తనదైన సిగ్నేచర్ స్వాగ్‌తో జెన్ జీ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేస్తున్న తలైవా వింటేజ్ స్టైల్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
[FEATURED_IMAGE]రజనీకాంత్ సినిమా అనగానే సాధారణంగా భారీ యాక్షన్, గన్స్, రౌడీలను ఊచకోత కోసే మాస్ ఎలివేషన్లే గుర్తొస్తాయి. అయితే ఎలాంటి ఆయుధాలు లేకుండా, కేవలం తన బాడీ లాంగ్వేజ్, స్టైల్‌తోనే థియేటర్లలో ఈలలు వేయించగల అరుదైన మేజిక్ ఆయన సొంతం. సిగరెట్ తిప్పడం, కళ్లజోడు స్టైల్‌గా పెట్టడం, వేగంగా నడవడం వంటి చిన్న చిన్న మూమెంట్స్‌తోనే ఆయన దశాబ్దాలుగా వెండితెరను ఏలారు. తాజాగా విడుదలైన 'ధర్మన్' దీపావళి పోస్టర్‌లో రజనీ వింటేజ్ స్వాగ్ మరోసారి వెండితెరపై మాయ చేయబోతోందని స్పష్టమైంది.
ఆయుధం లేదు.. భారీ కాస్ట్యూమ్స్ లేవు!
రీసెంట్‌గా వచ్చిన 'జైలర్', 'కూలీ' చిత్రాల్లో రజనీకాంత్ పవర్‌ఫుల్ యాక్షన్, గన్ ఫైట్లతో విరుచుకుపడ్డారు. కానీ 'ధర్మన్'లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపించారు. వెనుక కార్లు, సిటీ బ్యాక్‌డ్రాప్ ఉన్నా.. రజనీ సింపుల్ హెయిర్ స్టైల్, సన్‌గ్లాసెస్, మెడలోని చైన్ సరిచేసుకుంటున్న ఆ ఒక్క స్టిల్ 'బాషా', 'నరసింహ' రోజుల నాటి జ్ఞాపకాలను రీకాల్ చేస్తోంది. డిసెంబర్ 12న 76వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న ఈ వయసులోనూ రజనీ కొత్త తరం దర్శకులతో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సైతం సవాలు విసురుతున్నారు.
కమల్ హాసన్ నిర్మాతగా.. అనిరుధ్ మ్యూజిక్!
'ఓ మై కడవులే', 'డ్రాగన్' చిత్రాలతో నేటి తరం పల్స్ పట్టుకున్న అశ్వత్ మారిముత్తు.. రజనీలోని అసలైన స్టైల్‌ను నేటి జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. వయసుతో పాటు రజనీ స్టైలింగ్‌లో మార్పులు వచ్చినా, ముత్తువేల్ పాండియన్ తరహాలో నెమ్మదిగా నడవడం, చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడమే స్క్రీన్‌పై పూనకాలు తెప్పిస్తోంది. ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. నయనతార, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా వంటి భారీ తారాగణం నటిస్తున్న 'ధర్మన్'.. విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

