రామాయణ మూవీ బడ్జెట్ లీక్: యశ్ సింహాసనానికే కోటి రూపాయలా!

naveen
By -
Ramayana Part 1 movie high budget sets, Yash Ravana throne and Rakul Preet Singh chariot details.

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ తెరకెక్కించిన విజువల్ వండర్ 'రామాయణ పార్ట్ 1' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్, నిర్మాణ వ్యయానికి సంబంధించిన మైండ్‌బ్లాంక్ అయ్యే నిజాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యశ్ పోషించిన రావణాసురుడి కోసం ఏకంగా కోటి రూపాయలతో సింహాసనం, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్ర కోసం కోటిన్నరతో స్వర్ణ రథం తయారు చేయించడం సినిమా బడ్జెట్ స్థాయికి అద్దం పడుతోంది.

[FEATURED_IMAGE]

రామాయణం లాంటి ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే మాటలు కాదు. అందులో రాముడు, సీత, రావణుడు లాంటి ఎపిక్ పాత్రలకు ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఇవ్వాల్సిన పనిలేదు.. ఆయా పాత్రల పేర్లే ఒక బ్రాండ్. కానీ దర్శకుడు నితీశ్ తివారీ, మేకర్స్ మాత్రం ఈ పాత్రల రాజసాన్ని విజువల్‌గా మరింత అద్భుతంగా చూపించేందుకు ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదు. రాజభవనాలు, వస్త్రాలు, ఆభరణాల కోసం వందల కోట్లు కుమ్మరించారు.


యశ్ కోసం 4 వేల ఆభరణాలు.. కోటి రూపాయల సింహాసనం!


ఈ సినిమాలో లంకాధిపతి రావణుడి పాత్రకు అత్యంత భారీ ప్రాధాన్యత ఇచ్చారు మేకర్స్. యశ్ రాజసం ఉట్టిపడేలా కనిపించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. రావణుడు దర్జాగా కూర్చునే సింహాసనాన్ని ప్రత్యేకంగా బంగారు తాపడంతో అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. కేవలం ఈ ఒక్క సింహాసనం తయారీ కోసమే చిత్రయూనిట్ దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, రావణుడి గెటప్ కోసం ఏకంగా 4 వేల రకాల వైవిధ్యమైన ఆభరణాలను సిద్ధం చేసి పాత్రకు ప్రాణం పోశారు.


ముంబైలో 150 సెట్లు.. శూర్పణఖ రథానికే కోటిన్నర!


రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్రకు కూడా చిత్రయూనిట్ భారీగానే ఖర్చు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన ఈ పాత్ర ప్రయాణించే రథాన్ని ప్రత్యేకమైన బంగారు అలంకరణలతో రూపొందించారు. దీని తయారీకే అక్షరాలా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం.


ఇక రామాయణ కాలాన్ని, ఆనాటి వైభవాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అహర్నిశలు శ్రమించింది. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఏకంగా 150 భారీ సెట్లను నిర్మించారు. కేవలం భావోద్వేగాలనే నమ్ముకోకుండా, వాటిని ఇంత భారీ విజువల్ కాన్వాస్‌పై చూపించడానికి నిర్మాతలు చేసిన ఈ సాహసం.. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.