ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాలు విడుదలవుతున్నాయి. కథ బాగుంటే చాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలు సైతం భారీ విజయాలు సాధిస్తున్నాయి. కొత్త దర్శకులతో సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు. అయితే, కొంతమంది హీరోలు మాత్రం హిట్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తున్నా కూడా విజయం అందుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా? ఇప్పటివరకు 21 సినిమాలు చేసిన ఆ కుర్ర హీరో కేవలం రెండే రెండు హిట్లు అందుకున్నాడు. కానీ అతనికి క్రేజ్ మాత్రం భారీగానే ఉంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆది సాయి కుమార్.
ఆది సాయి కుమార్ సినీ ప్రస్థానం:
2011లో "ప్రేమ కావాలి" సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటుడు మరియు సైమా ఉత్తమ నూతన నటుడు అవార్డులు లభించాయి. ఆ తర్వాత 2012లో "లవ్లీ" సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.
వరుస సినిమాలు.. నిరాశపరిచిన ఫలితాలు:
"లవ్లీ" తర్వాత ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలాగే, జీ5లో విడుదలైన "పులి మేక" వెబ్ సిరీస్‌లో ఫోరెన్సిక్ టీమ్ హెడ్‌గా ప్రభాకర్ శర్మ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే, వెబ్ సిరీస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, సినిమాల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. 2022లో ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. ఇక చివరిగా విడుదలైన "షణ్ముఖ" సినిమా కూడా నిరాశపరిచింది.
ఆశలు రేపుతున్న "శంభల":
ప్రస్తుతం ఆది సాయి కుమార్ "శంభల" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

