బంగారం ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర అత్యధిక స్థాయికి చేరుకొని లక్ష మార్కును సమీపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధర ఆగకుండా పెరుగుతూనే ఉంది. అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య వివాదాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇతర పరిణామాలతో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 98 వేల రూపాయల దగ్గర ఉంది. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. 2025 ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల వరకు వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం, దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,460 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,590 గాను ఉంది. వెండి కిలో ధర రూ.99,900 గా ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం 10 గ్రాముల ధరపై దాదాపు రూ.270 మేర పెరిగింది. అయితే, ప్రాంతాల వారీగా బంగారం మరియు వెండి ధరల్లో స్వల్పంగా మార్పులు ఉంటాయి. అంతేకాకుండా, ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
విశాఖపట్నం: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
విజయవాడ: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
ఢిల్లీ: 22 క్యారెట్లు - రూ.89,610 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,740 (10 గ్రాములు)
ముంబై: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
చెన్నై: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
బెంగళూరు: 22 క్యారెట్లు - రూ.89,460 (10 గ్రాములు), 24 క్యారెట్లు - రూ.97,590 (10 గ్రాములు)
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్: రూ.1,09,900
విజయవాడ: రూ.1,09,900
విశాఖపట్నం: రూ.1,09,900
ఢిల్లీ: రూ.99,900
ముంబై: రూ.99,900
బెంగళూరు: రూ.99,900
చెన్నై: రూ.1,09,900

