ఈ బీచ్‌లో రిలాక్స్ అవ్వాలంటే దుస్తులు విప్పేయాల్సిందే.. ఎక్కడో తెలుసా?


 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒత్తిడులు ఎదురవుతున్నాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండటానికి చాలామంది రకరకాల ప్రదేశాలను సందర్శిస్తున్నారు. వీకెండ్ లేదా నెలలో రెండుసార్లు అయినా అవుటింగ్ వెళ్లాలని చాలామంది ప్లాన్ వేసుకుంటారు. అయితే కొంతమందికి బీచ్‌లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సముద్రపు ఒడ్డున గడపడం వల్ల మనస్సు ఉత్తేజితమవుతుంది. దీంతో కొందరు జంటలు ఎక్కువగా ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే సాధారణంగా బీచ్ అనగానే తక్కువ దుస్తులతో ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కొన్ని బీచ్‌లలో అసలు దుస్తులే ఉండకూడదని నిబంధన ఉంది. అలాంటి బీచ్‌లు ఎక్కడ ఉన్నాయంటే?


కొన్ని బీచ్‌లలో దుస్తులు తప్పనిసరి కాదు.. కానీ కొన్ని చోట్ల అసలే వేయకూడదు!

ఎక్కడికైనా బీచ్‌లోకి వెళ్లినప్పుడు కొందరు తమ శరీరం గురించి మరిచిపోయి రిలాక్స్‌ అవుతుంటారు. ఈ క్రమంలో కొందరు హాఫ్ డ్రెస్ వేసుకొని హాయిగా ఉంటారు. వీరిని కొత్తగా చూసేవారు విచిత్రంగా చూడవచ్చు. కానీ ఎప్పటినుంచో బీచ్‌లకు వెళ్లేవారు పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని ప్రత్యేకమైన బీచ్‌లకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా ఒంటిమీద ఒక్క నూలు పోగు కూడా ఉండకూడదట. అలా ఉంటేనే ఆ బీచ్‌లోకి అనుమతిస్తారు.

జర్మనీలోని బాల్టిక్ తీరంలో ప్రత్యేక బీచ్

జర్మనీలోని బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. ఇక్కడ రోస్టార్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక బీచ్‌కు వెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా ఎలాంటి దుస్తులు వేసుకోకూడదట. ఒకవేళ దుస్తులు వేసుకొని వస్తే మాత్రం ఇక్కడికి అనుమతించరు. అయితే గతంలో కొందరు దుస్తుల్లేకుండా ఇక్కడ ఉండేవారు. మరికొందరు దుస్తులు వేసుకొని వచ్చేవారు. దీంతో దుస్తుల్లేని వారిని విచిత్రంగా చూసేవారు. అయితే వారు తమ వ్యక్తిగత గోప్యతను కోల్పోతున్నామంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో రోస్టార్ డిపార్ట్‌మెంట్ వారు ఇక్కడికి వచ్చేవారు ఎలాంటి దుస్తులు వేసుకోవద్దని నిబంధనలు పెట్టారు.

అమెరికాలోని ఫ్లోరిడాలోనూ ఇలాంటి బీచ్

ఈ ప్రాంతంలో ఇది మాత్రమే కాకుండా మరికొన్ని బీచ్‌లు కూడా ఇలాంటి నిబంధనలతోనే ఉన్నాయి. అలాగే అమెరికాలోని ఫ్లోరిడాలో మరో బీచ్ కూడా ఇలాంటి నిబంధనలతోనే కొనసాగుతోంది. సముద్రపు అలల పక్కన అలా ఉండడం వల్ల శరీరం రిలాక్స్‌గా మారుతుందని వారు భావిస్తారు. ఈ క్రమంలో శరీరంపై ఎలాంటి దుస్తులు ఉన్నా ఒత్తిడి దూరం కాదని భావిస్తారు. అయితే ఇక్కడికి ఎక్కువగా జంటలుగానే వస్తుంటారు. ఒంటరిగా వచ్చే వారికి ఇక్కడ అనుమతి ఇవ్వరు. ఈ బీచ్‌కి రాగానే కేవలం సేద తీరడమే కాకుండా సముద్ర స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ప్రాంతంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ స్నానం చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఇక్కడికి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ రోస్టార్ డిపార్ట్‌మెంట్ వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు