ఎముకలు, దంతాలకు బలం: కాల్షియం - ఖర్జూరం పాల ప్రయోజనాలు

naveen
By -
0

ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే మన శరీరానికి కాల్షియం చాలా అవసరం. వయసుతో పాటు కండరాలు చక్కగా పనిచేయడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతీ భాగానికి సందేశాలను చేరవేయడానికి నరాలకు కాల్షియం కావాలి. రక్తనాళాలు శరీరమంతా రక్తాన్ని పంప్ చేయడంలోనూ, అనేక శరీర విధులను ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేయడంలోనూ కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అందుకే, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు, ఖర్జూరంలో కాల్షియంతో పాటు ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అసలు ఎలా తీసుకోవాలో, దాని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఖర్జూరం పాలు: ప్రయోజనాలు

జీర్ణ సమస్యలకు పరిష్కారం: మీకు తరచుగా జీర్ణ సమస్యలు ఉంటే, రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

నిద్రలేమికి చెక్: నిద్రలేమితో బాధపడేవారు ఖర్జూరం పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం: ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి.

బరువు పెరగాలనుకునే వారికి: బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి, రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది. ఖర్జూరంలో కేలరీలు, పోషకాలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగడానికి తోడ్పడతాయి.

కండరాలకు బలం: పాలలో ఖర్జూరం కలపడం వల్ల కండరాలకు మంచి పోషకాలు అందుతాయి. ఖర్జూరంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ కండరాలు బలంగా తయారవడానికి సహాయపడుతుంది.

బీపీ నియంత్రణ: రక్తపోటును నియంత్రించడానికి పాలలో ఖర్జూరం కలిపి తాగండి. ఎందుకంటే వాటిలో మంచి పొటాషియం ఉంటుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!