చూడటానికి ఎర్రగా, ఆకర్షణీయంగా ఉండే ఆ పండు.. మీ గుండెకు, చర్మానికి ఎంత పెద్ద రక్షో తెలుసా?
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా అవసరం. వైద్యులు కూడా రోజూ కనీసం ఒక పండు తినాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రతి పండు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, 'రాస్ప్బెర్రీస్' (Raspberries) ప్రయోజనాలు చాలా ప్రత్యేకమైనవి.
యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్
రాస్ప్బెర్రీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఆంథోసైనిన్లు, ఎల్లజిక్ యాసిడ్ వంటివి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
గుండెకు మిత్రుడు.. కొలెస్ట్రాల్‌కు శత్రువు!
రాస్ప్బెర్రీస్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును (BP) నియంత్రణలో ఉంచుతుంది. ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచి, వాపును తగ్గించి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గడానికి.. రక్తంలో షుగర్‌కు..
రాస్ప్బెర్రీస్‌లో ఫైబర్ కూడా పుష్కలం. ఇది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రాస్ప్బెర్రీ పండ్లను తినడం చాలా మంచిది. అంతేకాదు, ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మెరిసే చర్మానికి.. వయసు తగ్గించడానికి!
రాస్ప్బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి 'కొల్లాజెన్' ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సాగిపోకుండా, యవ్వనంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించి, ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.
కేవలం రుచికోసమే కాదు, గుండె, చర్మం, జీర్ణక్రియ.. ఇలా శరీరమంతటికీ ప్రయోజనం చేకూర్చే రాస్ప్బెర్రీస్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

