మీ ఇంటి ముందున్న ఆ చిన్న ఖాళీ స్థలమే.. మీకు నెల నెలా 30,000 తెచ్చిపెడుతుంది! పెట్టుబడి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు.
మీకు రోడ్డు పక్కన గానీ, మార్కెట్‌లో గానీ, లేదా జనసంచారం ఉన్న నివాస ప్రాంతంలో గానీ 50 నుండి 80 చదరపు అడుగుల చిన్న స్థలం ఉందా? దాన్ని ఖాళీగా ఉంచి వృధా చేయకండి! ఆ స్థలాన్ని ఏదైనా బ్యాంకుకు లేదా ప్రైవేట్ సంస్థకు ATM ఏర్పాటు కోసం అద్దెకు ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీరు ప్రతీ నెలా సులభంగా అదనపు ఆదాయం సంపాదించవచ్చు.
పెట్టుబడి లేకుండానే.. అద్దె + కమీషన్!
ఈ వ్యాపారంలో అత్యుత్తమమైన విషయం ఏమిటంటే, మీరు యంత్రాన్ని కొనాల్సిన లేదా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు లేదా ప్రైవేట్ కంపెనీనే ATMను ఇన్‌స్టాల్ చేస్తుంది. దీని ద్వారా మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా నెలకు రూ.20,000 నుండి రూ.30,000 వరకు అద్దె, కమీషన్ రూపంలో సంపాదించవచ్చు.
ఏం కావాలి? ఎలా అప్లై చేయాలి?
ATM ఇన్‌స్టాల్ చేయడానికి మీకు కావలసిందల్లా గ్రౌండ్ ఫ్లోర్‌లో, అందరికీ కనిపించేలా శుభ్రమైన స్థలం, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సౌకర్యం మాత్రమే. మిగిలిన పనిని కంపెనీ చూసుకుంటుంది.
ATM ఇన్‌స్టాల్ చేయడానికి, మీరు ఆసక్తి ఉన్న బ్యాంకు లేదా ప్రైవేట్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించి, మీ స్థలానికి సంబంధించిన వివరాలు, ఫోటోను అప్‌లోడ్ చేయాలి.
లక్ష వరకు సంపాదించే అవకాశం
మీ స్థలం వారికి అనుకూలంగా ఉంటే, కంపెనీ ప్రతినిధి స్వయంగా సందర్శించి తనిఖీ చేస్తారు. ఆపై 3 నుండి 5 సంవత్సరాల వరకు లీజు ఒప్పందంపై సంతకం చేస్తారు. మీ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటే, లావాదేవీలు ఎక్కువగా జరిగి, మీ నెలవారీ సంపాదన అద్దెతో పాటు కమీషన్ కలుపుకుని లక్ష రూపాయల వరకు కూడా చేరవచ్చు.
మీ బాధ్యత ఇది!
ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, మీరు ఆ ప్రదేశంలో భద్రత (సెక్యూరిటీ), విద్యుత్తును మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. యంత్రం నిర్వహణ మొత్తం కంపెనీదే.
వృధాగా ఉన్న చిన్న స్థలాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అదనపు ఆదాయం మీ జీతంతో పాటు నమ్మకమైన అదనపు ఆదాయ వనరుగా మారవచ్చు.

