'మిరాయ్'లో డీసెంట్ రోల్ చేసి ఆకట్టుకున్న శ్రియ, ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చింది! తన పాత గ్లామర్ షోతో కుర్రాళ్లకు కిక్కిస్తూ, ఒక హాట్ స్పెషల్ సాంగ్‌తో వచ్చేసింది.
'నాన్ వయోలెన్స్'లో 'కనకం' సాంగ్..
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరినీ కవర్ చేసిన మిల్కీ బ్యూటీ శ్రియ శరణ్, పెళ్లి తర్వాత కూడా తన హవా తగ్గలేదని నిరూపిస్తోంది. తాజాగా, మెట్రో శిరీష్ హీరోగా నటిస్తున్న 'నాన్ వయోలెన్స్' అనే చిత్రం నుండి "కనకం" అనే వీడియో సాంగ్ విడుదలైంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటలో శ్రియ తన గ్లామర్ షోతో అదరగొట్టింది. ఈ పాటను భాస్య శ్రీ రచించగా, యువన్ శంకర్ రాజా, తేజశ్విని నందిభట్ల ఆలపించారు.
శ్రియ గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా!
ఈ పాటలో శ్రియ అందానికి, ఆమె ఫిజిక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పెళ్లై, ఒక పాప పుట్టిన తర్వాత కూడా ఆమె తన లుక్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని కామెంట్ చేస్తున్నారు. "శ్రియ ఇప్పటికీ హీరోయిన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'మిరాయ్' సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో సర్ ప్రైజ్ చేసిన శ్రియ, ఇప్పుడు ఇలాంటి స్పెషల్ సాంగ్‌తో మెస్మరైజ్ చేయడం ఆమె ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఏ రోల్ అయినా.. ఐయామ్ రెడీ!
శ్రియ కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు, తనకు సూటయ్యే ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకని సమయంలో శ్రియ బెస్ట్ ఆప్షన్‌గా ఉండేవారు. అయితే, ఇప్పుడు మీనాక్షి చౌదరి, శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్లు కూడా సీనియర్లతో జతకడుతుండటంతో, శ్రియకు ఆఫర్లు కాస్త తగ్గాయి. అయినప్పటికీ, వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా శ్రియ తన టాలెంట్‌ను నిరూపించుకుంటూనే ఉన్నారు.
మొత్తం మీద, 'కనకం' స్పెషల్ సాంగ్‌తో శ్రియ తన గ్రేస్, గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది. ఈ పాట సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి, కానీ ఆమె ఫ్యాన్స్‌కు మాత్రం ఇది కనుల పండుగే.

