బండ్ల కామెంట్స్‌కు SKN ఘాటు జవాబు

moksha
By -

 బండ్ల గణేష్ 'లూజ్ ప్యాంట్' కామెంట్స్ గుర్తున్నాయా? ఇప్పుడు ఆ కామెంట్లకు నిర్మాత SKN వేదిక దొరకగానే అదిరిపోయే రివర్స్ పంచ్ ఇచ్చారు!


బండ్ల కామెంట్స్‌కు SKN ఘాటు జవాబు


అసలు గొడవ.. బండ్ల వ్యాఖ్యలు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'కే-ర్యాంప్' ఈవెంట్‌లో బండ్ల గణేష్.. "ఒకట్రెండు హిట్లు కొట్టగానే లూసు ఫ్యాంట్లు, కళ్లజోడు వేసుకుని 'వాట్సాప్' అంటూ ఓవర్ యాక్షన్ చేస్తారు" అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా విజయ్ దేవరకొండ స్టైల్‌ను ఉద్దేశించే అన్నారని, ఆయన్నే టార్గెట్ చేశారని ఫ్యాన్స్ మండిపడ్డారు. బండ్ల తర్వాత వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మలేదు.


'సింహం సింహమే': SKN స్ట్రాంగ్ కౌంటర్!

ఈ వివాదం నడుస్తుండగానే, రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇదే అదనుగా, నిర్మాత SKN.. బండ్లకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. "రాజు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు కానీ ప్రిన్స్ ప్రిన్సే. సింహం అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహమే," అని SKN అన్నారు.


'విజయ్ పేరు చాలు.. బాక్సాఫీస్ పగిలిపోద్ది!'

ఆయన ఆపకుండా.. "ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే ఫేక్ అంటారు, మూడోసారి కొడితే దాన్ని ఇండస్ట్రీ షేక్ అంటారు!" అంటూ విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. "ఆయన పోస్టర్ వేసి, టీజర్ వేయకున్నా చాలు.. 'ది విజయ్ దేవరకొండ' అనే పేరు కనపడితే ఓపెనింగ్, బాక్సాఫీస్ పగిలిపోద్ది. అది విజయ్ స్టామినా," అంటూ కొనియాడారు.


మొత్తం మీద, SKN వ్యాఖ్యలు బండ్ల గణేష్‌కు పరోక్షంగా, కానీ బలంగా కౌంటర్ ఇచ్చినట్లేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బండ్లన్న ఎలా స్పందిస్తారో చూడాలి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!