ఆ హీరోయిన్‌కు 41 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం ప్రతీ నెలా ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తోంది! ఈసారి ఆ రూమర్స్‌పై ఆమె గట్టిగానే ఇచ్చిపడేసింది.
విజయ్‌తో రూమర్స్.. ఇప్పుడు ఫైర్!
సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిష, తరచూ తన వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్లతో ఇబ్బంది పడుతూనే ఉంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా, సినిమాలతో బిజీగా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, హీరో విజయ్‌తో త్రిషకు సీక్రెట్ రిలేషన్ ఉందంటూ, ముఖ్యంగా విజయ్ చేతిలో కుక్కపిల్ల (ఇజ్జి) ఉండగా, పక్కన త్రిష నవ్వుతూ కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేసింది.
"అసహ్యం వేస్తుంది": త్రిష క్లియర్ వార్నింగ్
అయితే, ఇలాంటి వార్తలపై త్రిష తాజాగా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. "ఇండస్ట్రీలో చాలా మందితో నాకు స్నేహం మాత్రమే ఉంది, కానీ వారందరినీ నా భర్తలుగా మీడియా చూపించడం తప్పుడు పని. స్నేహితులతో ఉన్న ఫోటోలను చూసి పెళ్లి వార్తలు రాయడం అసహ్యం వేస్తుంది. దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి," అని త్రిష క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు.
'విశ్వంభర'తో బిజీ.. కెరీర్‌పైనే ఫోకస్
ప్రస్తుతం త్రిష పూర్తి స్థాయిలో తన సినిమాలపైనే దృష్టి పెట్టిందని, ఇలాంటి నిరాధారమైన రూమర్స్ సృష్టించడం వల్ల తన ఇమేజ్ దెబ్బతింటుందని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజంట్ ఆమె మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో కీలక పాత్రలో నటిస్తోంది.
మొత్తం మీద, త్రిష ఈసారి తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఆమె ఈ వార్నింగ్‌ను బలంగానే ఇచ్చారు.

