ఇండిగో కష్టాలు: రూ. 750 కోట్లు రిఫండ్, 5% విమానాల కోత!

naveen
By -

"ప్రయాణికులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు!" కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగోకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, రద్దయిన టికెట్ల డబ్బులు కూడా వాపస్ వచ్చేస్తున్నాయి.


Rammohan Naidu announces 750 crore refund from Indigo.


దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రణాళికా లోపాల వల్లే ఈ సమస్య వచ్చిందని, దీనికి సంస్థనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, సమగ్ర విచారణ తర్వాత కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


రూ. 750 కోట్లు రిఫండ్.. 5% సర్వీసులు కట్!

షెడ్యూళ్లను సరిగా నిర్వహించలేకపోయినందుకు డీజీసీఏ ఇండిగోకు షాక్ ఇచ్చింది. ఆ సంస్థ రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించాలని ఆదేశించింది. మరోవైపు ప్రయాణికులకు ఊరటనిచ్చే గణాంకాలను మంత్రి బయటపెట్టారు.

  • భారీ రిఫండ్: ఇప్పటివరకు ప్రయాణికులకు రూ. 750 కోట్లకు పైగా డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు (Refund) ఇండిగో తెలిపిందని మంత్రి వివరించారు.

  • పర్యవేక్షణ: ఈ నెల 5 నుంచి 15 మధ్య రద్దయిన విమానాల రీఫండ్లు, బ్యాగేజీ సమస్యలను మంత్రిత్వ శాఖ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

  • ఉచిత రీబుకింగ్: ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరలపై పరిమితులు విధించడమే కాకుండా, అదనపు ఛార్జీలు లేకుండా రీబుకింగ్ సదుపాయం కల్పించింది.


సేఫ్టీ విషయంలో నో కాంప్రమైజ్!

పైలట్లు, సిబ్బంది పనివేళల (Rostering) నిబంధనల విషయంలో తగ్గేదే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయితే, మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.


Tags: