బ్యాంకుల్లో రూ. 1 లక్ష కోట్లు: మీ డబ్బు వెనక్కి తీసుకోండిలా!

naveen
By -

మీ బ్యాంకు ఖాతాలో మీకు తెలియకుండానే డబ్బులు ఉండిపోయాయా? దేశంలో ఇలా ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు అక్షరాలా లక్ష కోట్లు దాటిపోయింది. ప్రధాని మోదీ స్వయంగా చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్. మీ డబ్బును వెనక్కి తీసుకునే ఛాన్స్ ఇదే!


Prime Minister Narendra Modi graphic with text regarding unclaimed deposits in banks.


దేశవ్యాప్తంగా బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లలో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము (Unclaimed Money) కొండలా పేరుకుపోయింది. ఈ మొత్తం విలువ ఏకంగా రూ. 1 లక్ష కోట్లు దాటినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు కేంద్రం 'మీ డబ్బు - మీ హక్కు' (Your Money, Your Right) అనే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.


ఎక్కడ ఎంత ఉందంటే?

ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం, మర్చిపోయిన డబ్బుల లెక్క ఇలా ఉంది:

  • బ్యాంకులు: రూ. 78,000 కోట్లు

  • బీమా కంపెనీలు: రూ. 14,000 కోట్లు

  • డివిడెండ్లు: రూ. 9,000 కోట్లు

  • మ్యూచువల్ ఫండ్స్: రూ. 3,000 కోట్లు


ఇప్పటికే రూ. 2000 కోట్లు రిటర్న్!

కేంద్రం చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు పెట్టి.. అర్హులను గుర్తించి రూ. 2000 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు.


మీ డబ్బు ఉందేమో ఇలా చెక్ చేసుకోండి!

మీ పాత బ్యాంకు ఖాతాలు, పాలసీలు, లేదా తాతల నాటి షేర్లలో డబ్బులు ఉన్నాయేమో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ.

  1. UDGAM పోర్టల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన 'ఉద్గమ్' (UDGAM) పోర్టల్‌లో మీ వివరాలు ఇస్తే, ఏ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలిసిపోతుంది.

  2. వెబ్‌సైట్లు: ఆయా బ్యాంకులు, బీమా సంస్థల వెబ్‌సైట్లలో కూడా 'Unclaimed Deposits' విభాగంలో చెక్ చేసుకోవచ్చు.


Tags: