ఓం శాంతి శాంతి శాంతిః రివ్యూ: తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా? | Om Shanti Shanti Shantihi Telugu Movie Review

naveen
By -

Om Shanti Shanti Shantihi Telugu Movie Review : భర్త కొడితే భార్య ఏం చేయాలి? ఏడ్చుకుంటూ మూలన కూర్చోవాలా? లేక కరాటే నేర్చుకుని మరీ తిరిగి రివర్స్ కౌంటర్ ఇవ్వాలా? ఈ క్రేజీ పాయింట్ మీదే మలయాళంలో వచ్చిన 'జయ జయ జయ హే' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కథను మన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా 'ఓం శాంతి శాంతి శాంతిః' (Om Shanti Shanti Shantihi) పేరుతో తెలుగులో తీసుకొచ్చారు. డార్క్ కామెడీగా వచ్చిన ఈ సినిమా అసలు మన నేటివిటీకి సెట్ అయ్యిందా? ఒరిజినల్ చూడని వారికి ఈ సినిమా కిక్ ఇస్తుందా? తరుణ్ భాస్కర్ హీరోగా పాస్ అయ్యాడా?


Om Shanti Shanti Shantihi Telugu Movie Review


కథ: ఓంకార్ నాయుడు vs ప్రశాంతి 

కొండవీటి ప్రశాంతి (ఈషా రెబ్బా)ది మధ్యతరగతి జీవితం. చిన్నప్పటి నుంచి ఏదీ తన ఇష్టప్రకారం జరగదు. చివరకు ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి చేసుకుని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి వెళ్తుంది. భర్త అంబటి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) చేపల వ్యాపారి. పైకి మంచోడిలా కనిపించినా, భార్య తన చెప్పుచేతల్లోనే ఉండాలనే రకం. భర్త వేధింపులు భరించలేక ప్రశాంతి ఏం చేసింది? తిరిగి ఎలా ఫైట్ చేసింది? అన్నదే ఈ సినిమా అసలు కథ.


తరుణ్ భాస్కర్ - ఈషా: జోడీ అదుర్స్! 

డైరెక్టర్ గానే కాదు, నటుడిగానూ తరుణ్ భాస్కర్ ఇరగదీశారు. గోదావరి యాసలో ఆయన డైలాగ్ డెలివరీ, ఆ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా శాడిస్ట్ భర్తగా, అమాయకుడిగా ఆయన నటన నవ్వులు పూయిస్తుంది. ఇక ఈషా రెబ్బా సీరియస్ రోల్ లో చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్, క్లైమాక్స్ లో ఆమె నటన హైలైట్. భర్తను కొట్టే సన్నివేశాల్లో ఈషా ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.


హిట్టా? ఫట్టా? అసలు మ్యాటర్ ఇదే.. 

సినిమాలో ప్రధాన బలం కామెడీతో కూడిన ఫైట్ సీక్వెన్స్. భార్యాభర్తల గొడవను సీరియస్ గా కాకుండా ఫన్నీగా చూపించడం బాగుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేశాయి. అయితే, ఇది మక్కీకి మక్కీ రీమేక్ కావడం పెద్ద మైనస్. మలయాళ సినిమా 'జయ జయ జయ హే'ను ఓటీటీలో చూసిన వారికి ఇందులో కొత్తదనం అస్సలు కనిపించదు. దర్శకుడు సజీవ్ సేమ్ సీన్లను దించేయడంతో ఆ మ్యాజిక్ కాస్త మిస్ అయ్యింది. సెకండాఫ్ లో కథనం నెమ్మదించడం, బ్రహ్మాజీ పాత్రను సరిగా వాడుకోకపోవడం నిరాశ కలిగిస్తుంది.


ఒరిజినల్ చూడని వారికి పండగే! 

మీరు మలయాళ వెర్షన్ చూడకపోతే.. ఈ 'ఓం శాంతి శాంతి శాంతిహి' కచ్చితంగా నచ్చుతుంది. మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్. ఒకవేళ ఇప్పటికే ఒరిజినల్ చూసేసి ఉంటే మాత్రం.. లైట్ తీసుకోవచ్చు. తరుణ్ భాస్కర్ కామెడీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.


Om Shanti Shanti Shantihi Movie రేటింగ్: 3/5