నిన్న (శుక్రవారం) బంగారం, వెండి ధరలు చూసి కళ్లు తేలేశారా? ఒక్కరోజే రూ. 5000 పెరగడంతో గుండె గుభేల్ మందా? అయితే ఈరోజు (జనవరి 24, శనివారం) కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. నిన్నటి భారీ విధ్వంసం తర్వాత పసిడి, వెండి ధరలు కాస్త శాంతించాయి. భారీగా పెరగలేదు, అలాగని భారీగా తగ్గలేదు. కానీ వెండి మాత్రం నిన్నటి రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. మరి ఈ వీకెండ్ లో బంగారం కొనాలా వద్దా? ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో రేట్లు ఎలా ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం.
బంగారం ధరల్లో మార్పు లేదు
నిన్న ఒక్కరోజే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ. 5,400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈరోజు మాత్రం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మార్కెట్ నిలకడగా ఉంది.
24 క్యారెట్లు (10 గ్రాములు): హైదరాబాద్ లో ఈరోజు ధర రూ. 1,59,710 గా ఉంది.
22 క్యారెట్లు (10 గ్రాములు): ఆభరణాల తయారీకి వాడే ఈ బంగారం ధర రూ. 1,46,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
వెండి.. అదే జోరు
నిన్న ఒక్కరోజే రూ. 20,000 పెరిగిన వెండి, ఈరోజు కూడా అదే రేటు మెయింటైన్ చేస్తోంది. తగ్గేదేలే అన్నట్లుగా కిలో వెండి ధర రూ. 3,46,000 వద్దే నిలిచిపోయింది. సామాన్యుడికి వెండి కూడా అందనంత ఎత్తులో ఉందనడంలో సందేహం లేదు.
ప్రధాన నగరాల్లో రేట్లు: తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లలో రేట్లు ఒకేలా ఉన్నాయి.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,860.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,820.
ముంబై/బెంగళూరు: హైదరాబాద్ రేట్లే (రూ. 1,59,710) కొనసాగుతున్నాయి.
కొనకపోవడమే లాభం! ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నా, అవి ఆల్-టైమ్ హైలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి వల్ల రేట్లు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. అత్యవసరం అయితే తప్ప, ప్రస్తుతానికి కొనుగోళ్లు వాయిదా వేసుకోవడమే సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు.

