భారత క్రికెట్ జట్టుతో పనిచేయాలని ఉందా? భావి భారత క్రికెటర్లను తయారుచేసే అరుదైన అవకాశం మీ కోసం ఎదురుచూస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఒక కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) కోసం వివిధ కోచింగ్, అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ నుంచి ఫీల్డింగ్ వరకు.. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి?
బ్యాటింగ్ కోచ్‌లు (2 పోస్టులు)
టీమిండియా బ్యాటింగ్ పవర్ హౌస్ అని మనకు తెలుసు. ఆ పవర్ ను కొనసాగించే బాధ్యత వీరిదే.
బాధ్యతలు: జాతీయ సీనియర్ జట్టు, ఇండియా-ఏ, అండర్-19 జట్లు, రాష్ట్రాల అసోసియేషన్ ఆటగాళ్ల బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలి.
హెడ్ క్రికెట్ కోచ్, సెలక్టర్లతో కలిసి పనిచేస్తూ.. కొత్త ప్రతిభను వెలికితీయాలి.
ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌లు (3 పోస్టులు)
బుమ్రా, షమీ, సిరాజ్ లాంటి పేస్ దళాన్ని తయారుచేసే బాధ్యత వీరిపై ఉంటుంది.
విధులు: బౌలర్ల టెక్నిక్, వ్యూహాలు, ఫిజికల్ ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బౌలర్ల 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' (Workload Management) చాలా కీలకం. గాయాల బారిన పడకుండా వారిని కాపాడుతూ శిక్షణ ఇవ్వాలి.
ఫీల్డింగ్ కోచ్‌లు (4 పోస్టులు)
ఆధునిక క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో తెలిసిందే. క్యాచ్ లు పడితేనే మ్యాచ్ లు గెలుస్తాం.
వివరాలు: మొత్తం 4 పోస్టుల్లో.. మూడు పురుషుల విభాగానికి, ఒకటి మహిళల విభాగానికి కేటాయించారు.
ఆటగాళ్లలో చురుకుదనం (Agility), త్రోయింగ్, క్యాచింగ్ స్కిల్స్ ను పెంచడం వీరి ప్రధాన బాధ్యత.
పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ (1 పోస్టు)
ఇప్పుడు క్రికెట్ అంతా డేటా మీదే నడుస్తోంది. మ్యాచ్ విశ్లేషణ, స్పోర్ట్స్ సైన్స్ డేటాను క్రోడీకరించి.. జట్టు విజయానికి అవసరమైన వ్యూహాలు రచించడంలో అనలిస్ట్ కీలకం కానున్నారు.
అప్లై చేయడం ఎలా?
లొకేషన్: ఎంపికైన వారు బెంగళూరులోని ఎన్‌సీఏ (NCA) / సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
డెడ్‌లైన్: ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఎంపికైన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇది కేవలం ఉద్యోగం కాదు.. బాధ్యత!
భారత క్రికెట్ భవిష్యత్తును నిర్మించే 'ద్రోణాచార్యులు' కావాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ అవ్వకండి.

.webp)