Elon Musk Moon City Plan: మార్స్ కాదు.. ముందు మూన్!

naveen
By -
Elon Musk Moon City Plan


అందరూ ఎలన్ మస్క్ (Elon Musk) అంటే 'మార్స్' (Mars) మనిషి అనుకుంటారు. ఎప్పుడెప్పుడు అంగారకుడి మీద కాలు పెడదామా, అక్కడ కాలనీ కడదామా అని ఆయన కలలు కంటున్నారు. కానీ, సడన్ గా మస్క్ ప్లేట్ ఫిరాయించారు. "మార్స్ వెయిట్ చేయొచ్చు.. ముందు జాబిల్లిపై జెండా పాతేద్దాం" అంటున్నారు. రాబోయే పదేళ్లలో చంద్రుడిపై ఒక అద్భుతమైన నగరాన్ని (Moon City) నిర్మిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. మార్స్ కు వెళ్లాల్సిన రాకెట్లను.. చంద్రుడి వైపు ఎందుకు తిప్పుతున్నారు? మస్క్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి?


మార్స్ దూరం.. చంద్రుడు దగ్గర!


స్పేస్‌ఎక్స్ (SpaceX) బాస్ తన ప్లాన్ మార్చుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఆదివారం 'ఎక్స్' (X) వేదికగా ఆయన ఈ లాజిక్ వివరించారు.

  • మార్స్ కష్టం: అంగారకుడికి వెళ్లాలంటే గ్రహాల అనుకూలత (Alignment) కోసం 26 నెలలు ఆగాలి. పైగా ప్రయాణానికి 6 నెలలు పడుతుంది.

  • మూన్ ఈజీ: అదే చంద్రుడిపైకి అయితే.. ప్రతి 10 రోజులకు ఒకసారి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపవచ్చు. ప్రయాణానికి కేవలం 2 రోజులే పడుతుంది.


పదేళ్లలోపే 'మూన్ సిటీ'.. మానవ జాతికి బ్యాకప్


మానవ నాగరికత భవిష్యత్తును కాపాడాలంటే (Civilization Backup).. చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయడమే వేగవంతమైన, సులువైన మార్గమని మస్క్ డిసైడ్ అయ్యారు. అందుకే రాబోయే పదేళ్లలోపే చంద్రుడిపై స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని (Self-sustaining City) నిర్మించడంపై స్పేస్‌ఎక్స్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. రవాణా వేగంగా జరుగుతుంది కాబట్టి, నగర నిర్మాణ పనులు కూడా జెట్ స్పీడ్ లో పూర్తవుతాయని ఆయన భావిస్తున్నారు.


మరి అంగారకుడి సంగతేంటి?


అయితే, మార్స్ మిషన్ ను పూర్తిగా పక్కనపెట్టలేదని మస్క్ క్లారిటీ ఇచ్చారు. "రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో మార్స్ నగరంపై కూడా పనులు ప్రారంభిస్తాం. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ చంద్రుడికే" అని స్పష్టం చేశారు. అంతిమంగా జీవాన్ని, చైతన్యాన్ని నక్షత్రాలకు విస్తరించడమే స్పేస్‌ఎక్స్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.


 ప్లాన్ B ఇప్పుడు ప్లాన్ A అయ్యింది! 

మార్స్ కు వెళ్లాలంటే.. ముందు మూన్ పై ప్రాక్టీస్ చేయాల్సిందే. లాజిక్ చూస్తుంటే మస్క్ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. మన తరం వాళ్లు చంద్రుడిపై సిటీని చూడబోతున్నారన్నమాట!