Sarvam AI New Models: గూగుల్ కంటే బెటర్? భారతీయ ఏఐ సంచలనం

naveen
By -
Sarvam AI New Models


ఏఐ (AI) రేసులో అమెరికా కంపెనీలే గెలవాలా? మన భారతీయ స్టార్టప్ లు కొడితే ఆ దెబ్బ గట్టిగా ఉంటుంది! బెంగళూరుకు చెందిన 'సర్వమ్ ఏఐ' (Sarvam AI) ఇప్పుడు గ్లోబల్ టెక్ దిగ్గజాలైన గూగుల్ జెమిని, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీలకు చెమటలు పట్టిస్తోంది. ఇంగ్లీష్ లో వాళ్లు తోపులేమో కానీ.. భారతీయ భాషల విషయానికి వస్తే మాత్రం "మేమే నంబర్ వన్" అంటూ సర్వమ్ ఏఐ సవాల్ విసిరింది. తాజాగా రిలీజ్ చేసిన రెండు కొత్త మోడల్స్ టెక్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ మోడల్స్ ఏంటి? గూగుల్ కంటే ఎందుకు బెటర్?


'సర్వమ్ విజన్'.. కళ్లు చెదిరే క్లారిటీ!


సాధారణంగా గూగుల్ లెన్స్ లేదా ఇతర టూల్స్ వాడినప్పుడు తెలుగు లేదా హిందీ అక్షరాలను గుర్తించడంలో తప్పులు దొర్లుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'సర్వమ్ విజన్' (Sarvam Vision) వచ్చింది.

  • ఏంటిది?: ఇదొక ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) మోడల్.

  • స్పెషాలిటీ: తెలుగు, హిందీ, తమిళం సహా 22 భారతీయ భాషల్లోని డాక్యుమెంట్లను ఇది చిటికెలో చదివి, అర్థం చేసుకోగలదు.

  • పనితీరు: 'olmOCR-Bench' అనే పరీక్షలో దీనికి ఏకంగా 84.3 శాతం మార్కులు వచ్చాయి. గ్లోబల్ మోడల్స్ కంటే ఇక్కడి డాక్యుమెంట్లను ఇది బాగా డీకోడ్ చేస్తోంది.


'బుల్ బుల్'.. అచ్చం మనిషిలాగే!


రోబో మాట్లాడితే గొంతులో జీవం ఉండదు. కానీ సర్వమ్ ఏఐ తెచ్చిన 'బుల్ బుల్ V3' (Bulbul V3) అలా కాదు.

  • ఏంటిది?: టెక్స్ట్-టు-స్పీచ్ (Text-to-Speech) మోడల్. అంటే మనం రాసింది చదివి వినిపిస్తుంది.

  • స్పెషాలిటీ: ఇది ఎంత సహజంగా ఉంటుందంటే.. అవతలి వైపు మాట్లాడుతున్నది మనిషా లేక మిషనా అని డౌట్ వస్తుంది. టెలిఫోన్ ఆడియో క్వాలిటీలో ఇది ఇతర మోడళ్ల కంటే మెరుగ్గా ఉందని టెస్టుల్లో తేలింది. ప్రస్తుతం 11 భాషల్లో అందుబాటులో ఉంది, త్వరలో 22 భాషలకు రానుంది.


ఇంగ్లీష్ మోజులో మన భాషలను మర్చిపోయారు..


గ్లోబల్ ఏఐ మోడళ్లు ఇంగ్లీష్ మీద పెట్టిన శ్రద్ధ భారతీయ భాషల మీద పెట్టడం లేదని సర్వమ్ వ్యవస్థాపకులు డాక్టర్ వివేక్ రాఘవన్, డాక్టర్ ప్రత్యూష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ లోటును భర్తీ చేయడానికే ఈ దేశీయ మోడళ్లను తీసుకొచ్చారు.


ఫ్రీ ఆఫర్.. ట్రై చేయండి!

అన్నింటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ ఏపీఐలను, విజన్ అనుభవాన్ని ఈ నెల (ఫిబ్రవరి 2026) వరకు ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. డెవలపర్లు, టెక్ ఔత్సాహికులు దీన్ని టెస్ట్ చేయడానికి ఇదే మంచి సమయం.


లోకల్ టాలెంట్.. గ్లోబల్ ఇంపాక్ట్! 

మన భాష, మన యాస, మన డేటా.. మన దగ్గరే ఉండాలి. సర్వమ్ ఏఐ విజయం.. డిజిటల్ ఇండియా ప్రయాణంలో ఒక మైలురాయి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!